Samantha : పుష్ప సాంగ్ సమంత వారు వద్దన్నా కూడా చేసిందా..?

Samantha పుష్ప పార్ట్ 1 లో ఉ అంటావా సాంగ్ ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. పుష్ప 1 లో అన్ని సాంగ్స్ సూపర్ హిట్ కాగా అందులో ఉ అంటావా సాంగ్ నెక్స్ట్

  • Written By:
  • Publish Date - June 10, 2024 / 10:25 AM IST

Samantha పుష్ప పార్ట్ 1 లో ఉ అంటావా సాంగ్ ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. పుష్ప 1 లో అన్ని సాంగ్స్ సూపర్ హిట్ కాగా అందులో ఉ అంటావా సాంగ్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా సమంత ఆ సాంగ్ చేయడం మరింత క్రేజ్ తెచ్చుకునేలా చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సాంగ్ కి సమంత డాన్స్ మూమెంట్స్ కు పర్ఫెక్ట్ గా కుదిరింది. పుష్ప 1 లో సమంత ఆ సాంగ్ చేయడం వల్ల అక్కినేని ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ ఎదుకొంది. అప్పటికే నాగ చైతన్య నుంచి డైవర్స్ తీసుకున్న సమంత పుష్ప 1 లో ఆ రేంజ్ లో రెచ్చిపోవడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు అక్కినేని ఫ్యాన్స్.

పుష్ప 1 లో సమంత చేసిన ఆ సాంగ్ సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది. ఐతే ఆ సాంగ్ చేయడం సమంత సొంత నిర్ణయమని తెలుస్తుంది. అసలే డైవర్స్ తీసుకుని ఉన్న సమంత అలాంటి సాంగ్ చేయడం పట్ల ఆమె పేరెంట్స్ కూడా వద్దని అన్నారట. కానీ సమంత మాత్రం ఆ సాంగ్ చేసి తీరుతా అని చెప్పి చేసింది. ఆ సాంగ్ వల్ల సమంత తన గ్లామర్ విషయంలో వెనక్కి తగ్గేదిలేదని ప్రూవ్ చేసింది.

అయితే సమంత ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో ఆ సాంగ్ చేయకుండా ఉండాల్సిందని కూడా చెప్పింది. నాగ చైతన్య నుంచి దూరమైన సమంత పుష్ప 1 లో ఆ సాంగ్ చేయడం వల్ల అందరినీ షాక్ అయ్యేలా చేసింది. పుష్ప 2 లో కూడా సమంతని స్పెషల్ సాంగ్ చేయమని ఆఫర్ ఇస్తున్నా సమంత మాత్రం అందుకు నో చెబుతుందని తెలుస్తుంది.

Also Read : Naga Chaitanya : నాగ చైతన్యకు తల్లిగా స్టార్ హీరో వైఫ్..?