Site icon HashtagU Telugu

Samantha : బాలీవుడ్ బాద్షాతో సమంత.. ఆ సూపర్ కాంబో రిపీట్..!

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల విషయంలో అంత దూకుడుగా లేదు. సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు వరుస సినిమాలు చేస్తే బాగానే వర్క్ అవుట్ అవుతుంది కానీ అమ్మడు ఎందుకో సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం సినిమా చేస్తున్న సమంత బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సీరీస్ ని కూడా పూర్తి చేసింది.

సౌత్ సినిమాల నుంచి ఆఫర్లు వస్తున్నా కూడా పెద్దగా పట్టించుకోని సమంత బాలీవుడ్ ఆఫర్లను మాత్రం యాక్సెప్ట్ చేస్తుందని టాక్. ఇప్పటికే బాలీవుడ్ బడా హీరోల సినిమాల్లో సమంత నటిస్తుందని వార్తలు రాగా లేటెస్ట్ గా బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలో సమంత హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు.

లాస్ట్ ఇయర్ పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న షారుఖ్ ఖాన్ తన నెక్స్ట్ సినిమా కూడా రాజ్ కుమార్ హిరాణితో చేస్తున్నట్టు తెలుస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో సమంత ని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారు. సమంత చేస్తే మాత్రం కచ్చితంగా ప్రాజెక్ట్ కు మంచి క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. ఎలాగు సమంతకు సౌత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి షారుఖ్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేసి అదరగొట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Also Read : T20 World Cup 2024 : ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫై భారత్ విజయం..