Site icon HashtagU Telugu

Samantha : సమంత వాటికి ఓకే కానీ..?

Samantha Sensational Comments n Her Movies Health Issues and Divorce

Samantha Sensational Comments n Her Movies Health Issues and Divorce

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఖుషి తర్వాత సమంత సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంది. యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలు చేసిన సమంత ఆమెకు ఉన్న మయోసైటిస్ తోనే ఆ సినిమాలు చేసిందని తెలుస్తుంది. తనకున్న వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తున్నా సరే సమంత ఇప్పుడప్పుడే సినిమాలు చేయాలని అనుకోవడం లేదని తెలుస్తుంది. దాని వెనుక రీజన్స్ ఏంటన్నది మాత్రం తెలియట్లేదు.

సమంత ఈమధ్య ఫోటో షూట్స్ తో మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చింది. ఫోటో షూట్స్ కు ఓకే కానీ సినిమాలకు ఎందుకు సమంత నో చెబుతుంది అన్నది ఆడియన్స్ కు అర్ధం అవ్వట్లేదు. సమంత ఓకే అంటే చాలు కానీ ఆమెతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

సమంత చేస్తున్న ఫోటో షూట్స్ వల్ల ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నా సినిమాలు చేస్తే చూడాలని కోరుతున్నారు. ప్రస్తుతం సినిమాల విషయంలో సమంత నిర్ణయం ఏంటన్నది ఇంకా వెల్లడించలేదు. 2023 అయిపోయింది 2024 లో అయినా సమంత సినిమాలు చేస్తుందా లేదా అనే ఆలోచనలో ఉన్నారు ఆమె అభిమానులు. సమంత ఏం చేసినా ఆమె ఫ్యాన్స్ ఆమె వెంట ఉన్నారు.

Also Read : Nani : నాని నిజంగా జాతిరత్నమే..!

We’re now on WhatsApp : Click to Join