Site icon HashtagU Telugu

Samantha : అక్కడే ఫోకస్ చేస్తున్న సమంత.. ఎందుకు అలా ఫిక్స్ అయ్యింది..?

Samantha only Focus in Bollywood not interest to do south Movies

Samantha only Focus in Bollywood not interest to do south Movies

Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ త్వరలో సిటాడెల్ వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సీరీస్ కోసం ఈమధ్యనే డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న సమంత ఈ సీరీస్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సమంత మాటల తీరు చూస్తుంటే తను ఫోకస్ అంతా కూడా హిందీ సినిమాల మీదే పెట్టినట్టు అనిపిస్తుంది. సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలను ఆమె చేసేందుకు ఆసక్తిగా లేదని టాక్.

కారణాలు ఏవైనా సరే తెలుగులో సమంత ఇప్పుడప్పుడే నటించే అవకాశం లేదని తెలుస్తుంది. సమంతకు అవకాశాలు వస్తున్నా కూడా తెలుగులో చేసేందుకు అమ్మడు రెడీగా లేదన్నట్టు తెలుస్తుంది. అయితే హిందీ సినిమాలకు మాత్రం సమంత ఓపెన్ అనేస్తుందట.

బాలీవుడ్ లో సమంత ఆఫర్లు క్యూ కడుతున్నాయని తెలుస్తుంది. ఆమె ఓకే అనడం మొదలు పెడితే వరుస వెంట వచ్చేస్తాయని టాక్. అయితే కొన్నాళ్లు హిందీలోనే సినిమాలు చేయాలని చూస్తున్న సమంత నిర్ణయానికి ఆమె సౌత్ ఫ్యాన్స్ మాత్రం నాట్ ఓకే అంటున్నారు.

Also Read : Sanjay Dutt : సంజయ్ డిమాండ్ బాగుంది.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?