Site icon HashtagU Telugu

Samantha : సమంత ఎందుకిలా చేస్తుంది..?

Samantha Blasting Remuneration for Citadel

Samantha Blasting Remuneration for Citadel

Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తన సినిమాల విషయంలో ఫ్యాన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తుంది. మొన్నటిదాకా మయోసైటిస్ వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలు చేయాలని అనుకుంటుంది. ఐతే తెలుగు నుంచి వస్తున్న ఆఫర్లను మాత్రం సమంత హోల్డ్ లో పెడుతుందట. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఆ సినిమాలో సమంత లీడ్ రోల్ గా నటించడమే కాదు సినిమా నిర్మించేది కూడా ఆమె అవ్వడం విశేషం. సమంత ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది.

ఇక ఇదే కాకుండా సమంత బాలీవుడ్ లో మరో వెబ్ సీరీస్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. రాజ్ & డీకే చేస్తున్న నెక్స్ట్ వెబ్ సీరీస్ లో సమంత హీరోయిన్ గా ఓకే అయ్యిందట. ఆల్రెడీ రాజ్, డీకే చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2 లో నెగిటివ్ రోల్ చేసింది సమంత. ఆ తర్వాత వాళ్లిద్దరు డైరెక్ట్ చేసిన సిటాడెల్ హనీ బనీ సీరీస్ లో భాగమైంది.

ఇప్పుడు మరో సీరీస్ కు సమంత ఓకే చెప్పింది. సమంత ఏం చేసినా సరే ఆమె ఫ్యాన్స్ అంతా మెచ్చుకునే పాత్రలే చేస్తుంది. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండిటిలో ఇబ్బనులు ఎదుర్కొన్న సమంత తిరిగి ఫాం లోకి వచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరి సమంత కొత్త సీరీస్ ఎలా ఉంటుందో చూడాలి. రాజా డీకే తమ వెబ్ సీరీస్ లతో ఓటీటీ ఆడియన్స్ ని అలరిస్తున్నారు.