Site icon HashtagU Telugu

Samantha : ఆ సూపర్ హిట్ వెబ్ సీరీస్ లో సమంతకు ఛాన్స్ లేదా..?

Samantha No Chance In The Family Man Season 3 Raj And Dk

Samantha No Chance In The Family Man Season 3 Raj And Dk

Samantha బాలీవుడ్ లో సూపర్ హిట్ వెబ్ సీరీస్ గా అక్కడ ప్రేక్షకుల అభిమానం సంపాదించిన సీరీస్ ద ఫ్యామిలీ మ్యాన్. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ ప్రైం వీడియోకి స్పెషల్ క్రేజ్ తెచ్చిందని చెప్పొచ్చు. మనోజ్ భాయ్ పేయి, ప్రియమణి జంటగా నటించిన ఈ సీరీస్ సీజన్ 1 సూపర్ హిట్ కాగా ఆ జోష్ తోనే ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా తీశారు. అయితే సెకండ్ సీజన్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంతని కూడా తీసుకొచ్చారు.

ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ లో సమంత చేసిన రాజి పాత్రలో నటించి మెప్పించింది. సమంత ఇన్నేళ్ల కెరీర్ లో చేసిన సినిమాల కన్నా ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ తో వచ్చిన క్రేజ్ సెపరేట్ అని చెప్పొచ్చు. అయితే ఫ్యామిలీ మ్యాన్ థర్డ్ సీజన్ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రాజ్ అండ్ డీకే ఈమధ్యనే ఫ్యామిలీ మ్యాన్ 3 ని అనౌన్స్ చేశారు.

మనోజ్, ప్రియమణి లను రిపీట్ చేస్తున్న ఫ్యామిలీ మ్యాన్ 3 లో సమంత ఉంటుందా లేదా అన్న కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. సీరీస్ లో సమంత ఉంటే తప్పకుండా సీరీస్ కు మరింత క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం సమంత రాజా, డీకే చేస్తున్న సిటాడెల్ సీరీస్ లో నటిస్తుంది. ఈ సీజన్ పూర్తి కాగా ఫ్యామిలీ మ్యాన్ 3 ని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు.

ఖుషి సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న సమంత లేటెస్ట్ గా మా ఇంటి బంగారం అనే సినిమా అనౌన్స్ చేసింది. తన సొంత ప్రొడక్షన్ లోనే సమంత ఈ సినిమా చేస్తుండటం విశేషం.

Also Read : Allu Arjun : పెళ్ళైనా అల్లు అర్జున్ ఇప్పటికీ వన్ సైడ్ లవరేనా..?