Site icon HashtagU Telugu

Samantha, Naga Chaitanya to share screen? నాగచైతన్య, సమంత మళ్లీ కలిసి నటిస్తారా?

Samantha

Samantha

టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని దాదాపు ఏడాది కావోస్తోంది. సమంత మాత్రం ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇటవల సమంత కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్ 7’ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ షోలో నాగచైతన్యను మాజీ భర్తగా అభివర్ణించింది సామ్. చైతూ మాత్రం ఎటువంటి కామెంట్స్ చేయకుండా కేవలం సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. నాగ చైతన్య, సమంతలు ‘ఏ మాయ చేసావే’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మజిలీ’ లాంటి సినిమాలతో హిట్ ఫెయిర్ అనిపించుకున్నారు.

బ్రేకప్ తర్వాత వీరిద్దరు ఎప్పుడు కలిసి నటిస్తారోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయమై తనదైన శైలిలో బదులిచ్చాడు నాగచైతన్య. “అది జరిగితే చాలా క్రేజీగా ఉంటుంది. కానీ నాకు తెలియదు. విశ్వానికి మాత్రమే తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం” అంటూ స్పందించాడు. మొత్తానికి ’చేసామ్‌’ అభిమానుల్లో ఆశలు చిగురించేలా చేస్తున్నారు. నాగ చైతన్య బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ లో నటించాడు. ఇది తెలుగులో కూడా రానుంది. ఈ మూవీ ఆగస్ట్ 11 న విడుదల కాబోతోంది. సమంత ‘యశోద’, ‘ఖుషి’ లాంటి సినిమాలతో బిజీగా ఉంది.