విడాకులు తీసుకున్న తర్వాత ఎవరికీ వారు అయిపోయిన..సామ్ – చైతు (Sam – Naga Chaitanya) లు మరోసారి కలవబోతున్నట్లు తెలుస్తుంది. కలవబోతున్నట్లు అంటే ఇద్దరు ఒకటి కాబోతున్నారా..? అని అనుకోకండి. జస్ట్ ఓ వేడుక కు వీరు ఎవరికీ వారుగా హాజరుకాబోతున్నట్లు ప్రచారం నడుస్తుంది.
మొదటి సినిమాతోనే అందర్నీ మాయ చేసిన సామ్ (Samantha)..అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ పొజిషన్ కు వెళ్ళింది. అదే సమయంలో నాగ చైతన్య (Naga Chaitanya)ను ప్రేమ వివాహం చేసుకోవడం..ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకోవడం అంతే స్పీడ్ గా జరిగిపోయింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురి అవ్వడం..చాల రోజుల చికిత్స తర్వాత క్షేమంగా బయటపడడం జరిగింది. అనారోగ్యం నుండి బయటపడిన సామ్..పుష్ప లో ఐటెం సాంగ్ , పలు వెబ్ సిరీస్ లతో పాటు ఖుషి మూవీ చేసింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి తన ఆరోగ్యం ఫై దృష్టి పెట్టింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా ఇప్పుడు ఈ భామ వరుణ్ తేజ్ (Varun Tej Wedding) పెళ్ళికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. రేపు ఇటలీ లో వరుణ్ – లావణ్య ల వెడ్డింగ్ అట్టహాసంగా జరగబోతుంది. గత మూడు రోజులుగా అక్కడ పెళ్లి వేడుకలు నభూతో నభవిష్యతి అన్నట్లు జరుగుతున్నాయి. కాగా ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ స్టార్స్ సైతం హాజరుకాబోతున్నారు. వీరిలో నాగ చైతన్య , సమంతలు కూడా ఉన్నారట. సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఒక్కసారి కూడా ఎదురుపడలేదు. ఇప్పుడు మాత్రం వారిద్దరూ ఒక వేడుకలో ఎదురుపడే పరిస్థితి రాబోతోంది. ఈ వేడుకలో ఏదో ఒక సందర్భంలో నాగ చైతన్య సమంత ఎదురుపడే పరిస్థితి రాకుండా ఉంటుందా? ఇక అప్పుడు వాళ్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూసిన వారికే తెలియాలి.
Read Also : ACB Court : చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్ట్