అన్ బ్రేక‌బుల్ రిలేష‌న్ మెసేజ్ చైతూ, స‌మంత దోబూచులాట

స‌మంత‌, నాగ చైత‌న్య మ‌ధ్య వీడియోలు, మెసేజ్ ల వార్ ప‌రోక్షంగా జ‌రుగుతోంది. రూమ‌ర్స్ కు చెక్ పెట్టేలా అన్ బ్రేక‌బుల్ అంటూ ఇన్ స్ట్రాగ్రామ్ స్టోరీస్ లో వీడియో పోస్ట్ చేసింది. బెస్ట్ కంపెనీతో వ‌ర్షంలో సైకిల్ రైడింగ్ చేసిన వీడియోను పోస్ట్ చేసింది.

  • Written By:
  • Publish Date - September 29, 2021 / 12:31 PM IST

స‌మంత‌, నాగ చైత‌న్య మ‌ధ్య వీడియోలు, మెసేజ్ ల వార్ ప‌రోక్షంగా జ‌రుగుతోంది. రూమ‌ర్స్ కు చెక్ పెట్టేలా అన్ బ్రేక‌బుల్ అంటూ ఇన్ స్ట్రాగ్రామ్ స్టోరీస్ లో వీడియో పోస్ట్ చేసింది. బెస్ట్ కంపెనీతో వ‌ర్షంలో సైకిల్ రైడింగ్ చేసిన వీడియోను పోస్ట్ చేసింది. ఒక రోజులో 21 కిలోమీట‌ర్లు రైడ్ చేశాన‌ని, త‌న టార్గెట్ 100 కిలో మీట‌ర్స్ అంటూ పోస్ట్ చేయ‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
ఇటీవ‌ల నాగ‌చైత‌న్య‌, స‌మంత దూరంగా ఉంటున్నారు. పైగా స‌మంత ఇన్ స్ట్రాగ్రామ్ పేజీలో అక్కినేని పేరు లేకుండా చేసింది. ఎస్ అనే అక్ష‌రంతో మాత్ర‌మే పేజీని ఉంచ‌డ‌మే కాకుండా వీడియోలు మెసేజ్ ల‌ను పోస్ట్ చేస్తోంది. తాజాగా అన్ బ్రేక‌బుల్ అంటూ చేసిన మెసేజ్ ఆమె అభిమానుల‌ను ఆలోచింప చేస్తోంది. ప‌రోక్షంగా రూమ‌ర్స్ కు చెక్ పెట్టేలా ఆమె చేసిన మెసేజ్ ల‌ను అభిమానులు అన్వ‌యించుకుంటున్నారు.

 

గోవా, ముంబాయ్ త‌దిత‌ర టూరిస్ట్ ప్రాంతాల్లో ఫ్రెడ్స్ తో స‌మంత ఎంజాయ్ చేస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోల‌ను పోస్ట్ చేస్తోంది. వీడియోను తాజాగా పోస్ట్ చేయ‌డంతో పాటు ఆమె రాసిన మెసేజ్ ప‌రోక్షంగా చైతుతో రిలేష‌న్ గురించి చేసింద‌ని భావిస్తున్నారు. ఇలా మెసేజ్ లు, వీడియోలు, ఫోటోల వార్ చివ‌రకు ఎటు వైపు వెళుతుంద‌న‌ని అక్కినేని అభిమానులు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు