‘పుష్ప’ చిత్రంలో సమంత ఐటెం సాంగ్ చేస్తుందనే ప్రకటన రాగానే అభిమానుల్లో నూతన ఉత్సాహం మొదలైంది. గతంలో సమంత ఐటెం సాంగ్స్ చేయకపోవడం ఆ క్రేజ్‌కు ఓ కారణమైతే.. అదీ బన్నీ పక్కన ప్రత్యేక గీతం అనగానే ఆ క్రేజ్ రెట్టింపు అయింది. ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించిన ఆ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఇంద్రావతి చౌహాన్ మాస్ వాయిస్‌తో ఆలపించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ నెల 12న హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక భారీగా ప్లాన్ చేశారు. 17న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
పుష్ప సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ మ్యూజిక్‌కి బన్నీతో సమంత ఇరగదీసే స్టెప్పులేసిందని సమాచారం. ఈ పాట ఉ అంటావా.. ఊఊ అంటావా.. Oo Antava OoOo Antava అనే చరణంతో మొదలవుతుంది. ఇప్పటివరకు కెరీర్‌లో ఒక్కసారి కూడా ఐటెం సాంగ్స్ చేయలేదు. కానీ మొదటిసారిగా బన్నీ కోసం స్టెప్పులేసింది. దీంతో పుష్ప సినిమాకు సమంత స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్‌గా మారింది. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి 30 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.