Site icon HashtagU Telugu

Samantha Looks: హాలీవుడ్ హీరోయిన్ లా సమంత ఫోజులు.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

Sam

Sam

ఒక సినిమా (Cinema) పూర్తికాగానే మరో సినిమాపై ఫోకస్ పెడుతోంది సమంత. శాకుంతలం మూవీ రిలీజ్ కావడం, అది డివైడ్ టాక్ తెచ్చుకోవడం, సమంతపై విమర్శలు రావడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే శాకుంతలం హ్యంగోవర్ నుంచి బయటపడిన సామ్ తన నెక్ట్స్ మూవీలో పూర్తిగా నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra), రిచర్డ్‌ మడెన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’. ఈ సిరీస్‌ ప్రీమియర్‌ను లండన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రియాంక, నిక్‌ జోనాస్‌ దంపతులు, సమంత (Samantha)తో పాటు ఇతర సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. సిటాడెల్ టీమ్ రాజ్ అండ్ డీకే, హీరో వరుణ్ ధావన్ లతో పాటు సమంత సందడి చేసింది. సిటాడెల్ ఇంటెర్నేషనల్ సిరీస్. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రీమియర్ కి ఆమె హాజరయ్యారు.

సమంత నటిస్తున్న సిటాడెల్ (Citadel) సిరీస్ చిత్రీకరణ దశలో ఉంది. సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్ కి సమంత సూపర్ స్టైలిష్ గా తయారయ్యారు. ఇంటెర్నేషనల్ ఈవెంట్ కి మ్యాచ్ అయ్యేలా బ్లాక్ డిజైనర్ వేర్ ధరించారు. సమంత లేటెస్ట్ లుక్ వైరల్ (Viral) అవుతుంది. చిత్ర ప్రముఖులు సమంత ఫోటోలపై అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

ఇక దేశం మారగానే సమంత (Samantha) వేషం మార్చేశారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో సమంత తెల్లని వస్త్రాలలో కనిపించారు. చీర కట్టి, చేతిలో జపమాల పట్టి చాలా సాదాసీదాగా, ప్రశాంతమైన లుక్ మైంటైన్ చేశారు. సిటాడెల్ ప్రీమియర్ షోలో అచ్చం హాలీవుడ్ హీరోయిన్ లా మారిపోయింది. సమంత లుక్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సమంత ఫోటోలు (Photos) సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: KCR Strategy: ఈటలపై కేసీఆర్ స్కెచ్.. కౌశిక్ కు కీలక బాధ్యతలు!