Samantha@Us: యూఎస్ టూర్ లో సమంత.. అసలు రీజన్ ఇదే!

టాలీవుడ్ బ్యూటీ సమంతపై యుఎస్ పర్యటనపై ఆమె హెల్త్ కండీషన్ పై ఎన్నో పలు రకాల వార్తలొచ్చాయి.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 04:44 PM IST

టాలీవుడ్ బ్యూటీ సమంతపై యుఎస్ పర్యటనపై ఆమె హెల్త్ కండీషన్ పై ఎన్నో పలు రకాల వార్తలొచ్చాయి. సమంత చర్మవ్యాధి కారణంగా పలు సినిమాలకు బ్రేక్ తీసుకుందనీ, ట్రీట్ మెంట్ కోసం యూకేకు వెళ్లిందనీ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలు వైరల్ కావడంతో సమంత మేనేజర్ మహేంద్ర రియాక్ట్ అయ్యాడు. ఈ గాసిప్‌లో ఎలాంటి నిజం లేదని ఆయన కొట్టిపారేశాడు.

సమంత తన రాబోయే వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ కోసం శిక్షణ కోసం యుఎస్ వెళ్లినట్లు సమాచారం. రస్సో బ్రదర్స్ సిరీస్ ఇండియన్ వెర్షన్‌ లో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇందుకోసం సమంత కఠినమైన ట్రైనింగ్ తీసుకోనుంది. ప్రస్తుతం “సమంత యుఎస్‌లోని సిటాడెల్ కోసం తన పాత్ర కోసం రెడీ అవుతోంది. ఆమె క్యారెక్టర్ చాలా బలమైనది కావడంతో, అందుకు తగ్గట్టుగా మౌల్డ్ కావడానికి శ్రమిస్తోంది.

సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌ను ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ రాజ్, డికె డైరెక్ట్ చేస్తున్నారు. హిట్ గూఢచారి సిరీస్, ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్‌లో ప్రధాన విరోధిగా నటించిన సమంతతో మరోసారి ఈ ఇద్దరు కలిసి పనిచేయనున్నారు. శుక్రవారం సమంత శాకుంతలం సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. ఆమె యువరాణి అవతార్‌ లో ఆకట్టుకుంది. శకుంతల పౌరాణిక కథను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.