Site icon HashtagU Telugu

Samantha : త్వరలో సమంత ఎంగేజ్మెంట్.. ఆ దర్శకుడితో ప్రేమలో ఉందా..?

Samantha Ruth Prabhu

Samantha, Naga Chaitanya, Sobhita

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కినేని వారి ఇంటికి కోడలిగా వెళ్ళింది. చై-సామ్ జంట ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. అయితే వారిద్దరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. మూడేళ్ళలోనే విడాకులతో విడిపోయారు. వారిద్దరి బ్రేకప్ ప్రతి ఒక్కర్ని బాధ పెట్టింది. ఇక రెండేళ్ల నుంచి వీరిద్దరూ సింగల్ గానే ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్దమవుతున్నారట.

ఆల్రెడీ నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం జరుపుకొని పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇక సమంత కూడా త్వరలో నిశ్చితార్థం జరుపుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్ తనకి మంచి ఫేమ్ ని తెచ్చిపెట్టిన దర్శకుడినే సమంత పెళ్లి చేసుకోబోతుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరని ఆలోచిస్తున్నారా.. అతను ఎవరో కాదు, ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ ని డైరెక్ట్ చేసిన ఇద్దరు దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడుమోరు. ఇదే దర్శకుడితో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ని కూడా చేస్తున్నారు సమంత.

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మొదలైన వీరి స్నేహం సిటాడెల్ సిరీస్ తో ప్రేమగా మారిందని చెబుతున్నారు. గతంలో వీరిద్దరి ప్రేమ వార్తలు బాలీవుడ్ వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అంతేకాదు, రాజ్-సామ్ కలిసి దిగిన ఫోటోలు, సమంత బర్త్ డేని రాజ్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయడం వంటి ప్రేమ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయి. అయితే ఇన్నాళ్లు ఈ వార్తలు రూమర్స్ మాత్రమే అని అనుకున్నారు అందరూ. మరి సమంత- రాజ్ తమ నిశ్చితార్థంతో ఈ రూమర్స్ ని నిజం చేస్తారేమో చూడాలి.

Exit mobile version