ఆ విషయంలో శిల్పాశెట్టిని ఫాలో అవుతున్న సమంత!

టాలీవుడ్ హీరోయిన్ సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమెపై సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ లో రకరకాల వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 11:49 AM IST

టాలీవుడ్ హీరోయిన్ సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమెపై సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ లో రకరకాల వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కల్గిస్తున్నాయంటూ సమంత కోరుక్కెక్కింది. వ్యక్తిగత జీవితంపై పుకార్లు స్ప్రెడ్ చేసినందుకు పరువు నష్టం కేసు వేశారు. తన పరువు తీశారని ఆరోపించిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమంత చేసిన విజ్ఞప్తిని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కోర్టు తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. తన పరువుకు భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన 3 యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. యూట్యూబ్ ఛానెళ్లు వెంటనే కంటెంట్ తొలగించాలని ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేసింది. అయితే అందుకు అనుగుణంగా తన వ్యక్తిగత విషయాలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని న్యాయస్థానం పేర్కొంది. సమంత వ్యక్తిగత వివరాలూ ఎవరూ ప్రసారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

అయితే శిల్పాశెట్టి ఇటీవల దాఖలు చేసిన ‘శాశ్వత ఇంజక్షన్ ఆర్డర్’ కేసును ఇప్పుడు సమంతా కేసుకు రిఫరెన్స్ పాయింట్‌గా సమంతా తరఫు న్యాయవాది పేర్కొన్నట్లు సమాచారం. తన భర్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాల కేసులో అరెస్టు చేయడంతో శిల్పాశెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు సంబంధించిన అవమానకరమైన వార్తలను నివేదించకుండా మీడియా సంస్థలను ఆంక్షిస్తూ కోర్టు శాశ్వత నిషేధాజ్ఞను జారీ చేసింది. తన పరువు నష్టం కేసులో కూడా ఇదే విధమైన తీర్పు కోసం సమంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది. నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు కోరుకోలేదని, నేను అవకాశవాదినని, అబార్షన్ చేయించుకున్నానని చెప్పారు. విడాకులు అనేది చాలా బాధాకరమైన ప్రక్రియ. దాన్నుంచి బయట పడేందుకు చాలా సమయం పడుతుంది. ఈ కష్టకాలంలో మద్దతు ఇవ్వండి అంటూ సమంత ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.