Samantha: హాలీడే మూడ్ లో సమంత, నెక్ట్స్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

ప్రస్తుతం సమంత ఆస్ట్రియాలోని ‘వియన్నా’లో ఉంది. అక్కడ హాయిగా గడుపుతోంది.

Published By: HashtagU Telugu Desk
Samantha

Samantha

సమంతా దక్షిణాదిలోని అగ్ర కథానాయికలలో ఒకరు. తన ఫ్యామిలీ మ్యాన్ 2తో హిందీలో కూడా విజయాన్ని అందుకుంది. ఇటీవల ఈ నటి విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా చేసింది. అయతే షూటింగ్ సమయంలో అనారోగ్యం పాలైంది. చాలకాలం పాటు షూటింగ్స్ కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యింది. కాగా ఖుషి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. అయితే సమంత పాత్రను అందరూ మెచ్చుకున్నారు. ఖుషి విడుదల తర్వాత, సమంతా యుఎస్ వెళ్లి అక్కడ హాయిగా గడుపుతోంది.

అయితే వర్క్ పరంగా ఆమె ఒక్క సినిమా కూడా ప్రకటించలేదు. సల్మాన్‌ఖాన్‌తో సినిమా ఓకే చేసినా స్టార్ హీరోయిన్ మాత్రం సైలెంట్‌గా ఉందని కొందరు అంటున్నారు. మరి రానున్న రోజుల్లో సమంత తన కొత్త సినిమాను ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి, ఆమె సుదీర్ఘ విరామం తీసుకుంటోంది. ఆమె హాలిడే ను బాగా ఆస్వాదిస్తోంది.

కాగా ప్రస్తుతం సమంత ఆస్ట్రియాలోని ‘వియన్నా’లో ఉంది. ఇక అక్కడ నుంచి తాజాగా ఒక ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతుంది. ఒక షాప్ గోడ మీద.. Everybody’s Darling అని ఉంది. ఇక దాని ముందు సమంత నిలబడి ఫోటో దిగి, దానిని షేర్ చేస్తూ.. “Or not….I can live with both” అంటూ కామెంట్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వెనుక సమంత అర్ధం ఏంటంటే.. “నేను ఎవరికి నచ్చినా నచ్చకున్నా. నేను ఇద్దరితో కలిసి జీవించగలను” అంటూ తెలియజేసింది.

Also Read: Sachin Tendulkar: వరల్డ్ కప్ లో ఆ నాలుగే జట్లు సెమీస్ కు వెళ్తాయి: సచిన్ టెండూల్కర్

  Last Updated: 06 Oct 2023, 03:42 PM IST