Site icon HashtagU Telugu

Samantha: సరికొత్త లుక్ లో సమంత, పింక్ శారీలో బోల్డ్ లుక్స్

Sam

Sam

Samantha: సమంత నిరంతరం తన అభిమానులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అందమైన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. అయితే ఖుషి తర్వాత నటనకు దూరంగా ఈ బ్యూటీ విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సినిమా అప్డేట్స్ ఏమీ ఇవ్వకపోయినప్పటికీ తన టూరు, వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను మాత్రం షేర్ చేస్తోంది. అరుదైన వ్యాధితో బాధపడినా, అనారోగ్యం బారిన పడ్డప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటోంది.

తాజాగా సమంత పింక్ శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజు ధరించి అట్రాక్ట్ చేస్తోంది. మెడ అందాలతో మతెక్కించే ఫొటోలతో ఫోజులిచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దయాగుణం వ్యూహంగా కాకుండా జీవిత మార్గంగా అలవర్చుకున్నవారికి హ్యాట్సాఫ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ప్రస్తుతం సమంత చేతిలో పలు మూవీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, కేవలం ఆరోగ్యంపైనే ద్రుష్టి పెడుతోంది. అయితే ఇన్నాళ్లు ఒంటరిగా లైఫ్ ను లీడ్ చేస్తున్న సమంత తన మాజీ ప్రియుడు నాగచైతన్యను కలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: CM KCR: ఎన్నికల పోరు షురూ.. వేర్ ఈజ్ కేసీఆర్!

Exit mobile version