Samantha Ice Bath: సమంత ఐస్ బాతింగ్.. టార్చర్ చేస్తున్నారంటూ కామెంట్!

సమంతకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.

  • Written By:
  • Updated On - May 2, 2023 / 05:11 PM IST

టాలీవుడ్ నటి సమంత (Samantha) ప్రతిరోజు  వార్తల్లో ఎక్కుతుంది. సమంతకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా సమంత ఐస్ బాత్ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ తెర‌కెక్కించిన `సిటాడెల్`(Citadel)కు ఇండియన్ వెర్షన్ గా దీనిని రూపొందిస్తున్నారు. హాలీవుడ్ (Hollywood) లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా న‌టిస్తే.. ఇండియ‌న్ వెర్ష‌న్‌లో వరుణ్ ధావన్, స‌మంత జంట‌గా న‌టిస్తున్నారు. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ కు ద‌ర్శ‌కులు.

ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ముంబై (Mumbai)లో జ‌రుగుతోంది. స‌మంత‌పై హై ఓల్టేజ్ యాక్షన్ (Action) సన్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌ర్ఫెక్ష‌న్ కోసం డైరెక్ట‌ర్ రాజ్ అండ్ డీకే(Raj & DK) స‌మంత‌ను గ‌ట్టిగానే టార్చ‌ర్ చేస్తున్నార‌ట‌. షూటింగ్ లో బాగా అల‌సిపోయి స‌మంత ఒళ్లు నొప్పుల‌తో చాలా ఇబ్బంది ప‌డుతుంద‌ట‌. ఇక ఆ బాధ త‌ట్టుకోలేక స‌మంత షూటింగ్ పూర్తైన వెంట‌నే రికవరీ కావడానికి ఐస్ బాత్ చేస్తుంది.

తాజాగా స‌మంత ఐస్ బాత్ (Ice Bath) చేస్తున్న ఫోటోను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇది టార్చర్ అంటూ ఆమె కామెంట్ కూడా పెట్టారు. సమంత బాతింగ్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇక స‌మంత క‌ష్టాన్ని చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వ‌ర్క్ ప‌ట్ల స‌మంతకు ఉన్న డెడికేష‌న్ కు ఫిదా అవుతున్నారు.

Also Read: GST Records: జీఎస్టీలో భారత్ రికార్డు.. గుడ్ న్యూస్ అంటూ మోడీ ట్వీట్!