Site icon HashtagU Telugu

Samantha praises Alia: అలియా.. మీరు చేయలేనిది ఏదైనా ఉందా!

Samantha

Samantha

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ 29వ పుట్టినరోజు ఇవాళ. ఆమె పుట్టినరోజు సందర్భంగా సమంత తన ప్రేమను వ్యక్తం చేసింది. బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. “హ్యాపీ బర్త్ డే aliaabhat. మీరు చేయలేనిది ఏదైనా ఉందా? మీ విజయాలన్నింటినీ జరుపుకోవడానికి వేచి ఉండలేం’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు… వైట్ అండ్ వైట్ డ్రస్సులో, మేకప్ లేని అలియా ఫొటోను ఒకటి షేర్ చేసింది. కొద్ది రోజుల క్రితం కూడా అలియా నటించిన ‘గంగూబాయి’ సినిమా చూసి తన నటనను మెచ్చుకుని ‘మాస్టర్ పీస్’ అని పేర్కొంది సమంత.

అలియా ప్రస్తుతం తన లెటెస్ట్ మూవీ ‘గంగూబాయి కతివాడి’ విజయంతో దూసుకుపోతోంది. వారం రోజుల్లోనే 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. మార్చి 25న విడుదల కానున్న SS రాజమౌళి RRR విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటీవల విడుదలైన RRR ప్రమోషన్ సాంగ్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సందడి చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇక అలియా బాలీవుడ్ సినిమాలతో ఒక హాలివుడ్ మూవీలోనూ నటించనుంది. నటి సమంతతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ హీరోహీరోయిన్లు అలియాకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Samantha Bday Wishes Alia