Site icon HashtagU Telugu

Samantha : జిమ్‌లో సమంత భారీ కసరత్తులు.. అల్లు అర్జున్ సినిమా కోసమేనా..!

Samantha Gym Workouts Is For Allu Arjun Atlee Movie

Samantha Gym Workouts Is For Allu Arjun Atlee Movie

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అనారోగ్య సమస్యలతో సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖుషి సినిమా తరువాత మరో మూవీకి సైన్ చేయలేదు. ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ ఆరోగ్యం పై పెట్టారు. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నారు. అయితే సామ్ అభిమానులంతా.. తన రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ సమంతని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడుతున్నారు. కానీ సమంత ఎప్పుడు తిరిగి వస్తారు అనే దాని క్లారిటీ లేదు.

అయితే ఇటీవల సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ న్యూస్ బయటకి వచ్చింది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేయబోయే సినిమాలో హీరోయిన్ కోసం సమంతని సంప్రదించారని, ఆమె కూడా అందుకు ఓకే చెప్పారని టాక్ వినిపించింది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, సామ్ ఫ్యాన్స్ మాత్రం ఇది నిజం అయితే బాగుండు అని ఆశపడుతున్నారు. ఇది ఇలా ఉంటే, సమంత లేటెస్ట్ గా ఓ ఫోటో షేర్ చేసారు.

జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్న ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సమంత షేర్ చేసారు. ఆ పిక్ చూసిన నెటిజెన్స్.. “వామ్మో సమంత ఏంటి ఇంతలా కష్టపడుతుంది. సామ్ నిజంగానే అల్లు అర్జున్ మూవీకి సైన్ చేసి ఉంటారా. అందుకే ఈ కసరత్తులు చేస్తున్నారా..?” అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి సమంత నిజంగానే అట్లీ సినిమాకి సైన్ చేసారా లేదా అనేది తెలియాలంటే కొన్నాలు ఎదురు చూడాల్సిందే.

Samantha Photo

కాగా సమంత గతంలో అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అండ్ మెర్సెల్ సినిమాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక అల్లు అర్జున్ తో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించి సూపర్ హిట్టుని అందుకున్నారు. కాబట్టి ఈ సక్సెస్ కాంబినేషన్ తోనే రీ ఎంట్రీ ఇస్తే చాలా బాగుటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Also read : Ram Charan : కూతురితో కలిసి ఏనుగు రెస్క్యూ క్యాంపులో.. ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్..