Samantha : సమంత కొన్నాళ్ళు ఆరోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుంది. సమంత, వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో సమంత ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ లో నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహించగా ఓ నెటిజన్ మీరు కొంచెం బరువు పెరగొచ్చు కదా అని అడిగాడు. దీనికి సమంత ఫైర్ అయి గట్టిగానే సమాధానమిచ్చింది. సమంత ఈ ప్రశ్నకు బదులిస్తూ.. మళ్ళీ బరువు గురుంచి ప్రశ్న. నా బరువు గురించి నాకు తెలుసు. నేను ప్రస్తుతం చాలా స్ట్రిక్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో ఉన్నాను. అందువల్లే నా బరువు ఇలా ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల నేను ఇలానే ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపండి. అవతలి వారిని కూడా బతకనివ్వండి అంటూ ఫైర్ అయింది.
దీంతో సమంత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సమంత మయోసైటిస్ తో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తెలిసిందే. అయితే ఇప్పటికే కోలుకున్న కూడా ఇంకా పలు ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటుంది సమంత. రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుతూ పలు థెరపీలు చేసుకుంటుంది. ఇప్పుడు చెప్పిన సమాధానంతో ఇంకా సమంతా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read : Pooja Bedi : నాకు నటన రాదు.. అందుకే నా క్లీవేజ్ చూపించేదాన్ని.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..