Site icon HashtagU Telugu

Samantha Looks: టర్కీ అందాలకు సమంత ఫిదా, కొత్త లుక్స్ లో కెవ్వు కేక!

Samantha

Samantha

టాలీవుడ్ నటి సమంత (Samantha) ప్రస్తుతం టర్కీలో ఉన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీలో మధ్య తరగతి ముస్లిం అమ్మాయి పాత్రలో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన నా రోజా నువ్వే పాట పెద్ద హిటై ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అయితే సమంత ఒకవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు టర్కీ అందాలను ఆస్వాదిస్తోంది.

ఖుషి (Kushi) సినిమా షూటింగ్ లో ఉన్న సమంత ప్రస్తుతం టర్కీ టూర్ కు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ‘ఉత్తమ రోజులు’ అని క్యాప్షన్ ఇస్తూ అక్కడి అందాలను, సముద్ర తీర ప్రాంతాలు, కాఫీ తాగుతూ, ఇష్టమైన పుస్తకాలను ఫొటోలను షేర్ చేసింది. ఓ ఫొటోలో ఫ్లవర్ ప్రింటెడ్ దుస్తులను ధరించిన సమంత మిర్రర్ సెల్ఫీలకు ఫోజులిస్తూ ముద్దులు పెడుతోంది. మరో ఫొటోలో బ్లాక్ కలర్ టాప్ ధరించి గ్లామ్ లుక్ తో మతి పొగొట్టేస్తోంది. ప్రస్తుతం సమంత ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇంతకు మునుపు చూడని లుక్స్ లో సమంత కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.

కాగా మరోవైపు సమంత తన కోస్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) తో కలిసి టర్కీ ప్రాంతాలను విజిట్ చేస్తోంది. విజయ్ తో డిన్నర్ డేట్ కు వెళ్తూ షూటింగ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక ‘విజయ్ ఈజ్ బెస్ట్ బడ్డీ’ అంటూ సమంత ఇప్పటికే రియాక్ట్ అయ్యింది. వారిద్దరి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నా రోజా నువ్వే సాంగ్ తర్వాత సమంత, విజయ్ దేవరకొండపై ఓ ముఖ్యమైన పాటను చిత్రీకరించినట్లు సమాచారం. సెట్స్ నుండి కొన్ని BTS చిత్రాలు సోషల్ మీడియాలో కూడా ప్రత్యక్షమయ్యాయి.

Also Read: Telangana Politics: రాహుల్ చాతుర్యం, కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి!

Exit mobile version