Site icon HashtagU Telugu

Samantha : ‘ఆ రోజులు’ మళ్లీ రావొద్దంటూ సమంత ఎమోషనల్

Samantha Emoshanal

Samantha Emoshanal

సమంత (Samantha ) ఈమె గురించి ఎంత చెప్పిన తక్కువే. చీర కట్టిన, మోడ్రన్ డ్రెస్ వేసుకున్న, బికినీ వేసిన ఆమెకే చెల్లింది. మొదటి సినిమాతోనే అందర్నీ మాయ చేసిన సమంత..అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ పొజిషన్ కు వెళ్ళింది. అదే సమయంలో నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకోవడం..ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకోవడం అంతే స్పీడ్ గా జరిగిపోయింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురి అవ్వడం అందర్నీ షాక్ కు గురి చేసింది. సమంత ఇక కోలుకోలేదు అని అంత అనుకున్నారు కానీ ధైర్యం గా తనకు వచ్చిన వ్యాధి తో పోరాడి..మళ్లీ క్షేమంగా బయటపడింది. సినిమాలు అన్ని వదిలిపెట్టి చాల నెలలు చికిత్స తీసుకొని అనారోగ్యం నుండి బయటపడింది. ఆ తర్వాత పుష్ప లో ఐటెం సాంగ్ , పలు వెబ్ సిరీస్ లతో పాటు ఖుషి మూవీ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ (Varun Dhavan) తో కలిసి ‘సిటాడెల్: హనీ-బన్నీ’ (Citadel Honey Bunny) అనే వెబ్ సిరీస్ లో నటించింది. “ఫ్యామిలీ మ్యాన్” మరియు “ఫర్జీ” వంటి సూపర్ హిట్ సిరీస్ ల తరువాత దర్శకులు రాజ్ – డికె నుండి వస్తున్న ఈ సిరీస్ ఫై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కాబోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన గతం తాలూకా విషయాలు గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది. ‘ప్రతి ఒక్కరు తమ జీవితంలో మార్పు కావాలని కోరుకుంటున్నారు. విభిన్న కథలను ప్రేక్షకులకు అందించడమే నా లక్ష్యం. గతం వెనక్కి తిరిగి చూస్తే.. నాకు ఎలాంటి మార్గం కనిపించలేదు. నా స్నేహితులతో ఇదే విషయంపై చాలాసార్లు చర్చించాను. గత మూడేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. గడిచిన రోజులు మళ్లీ నా జీవితంలో రాకూడదని కోరుకుంటున్నా. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. మునుపటి కంటే బలంగా తయారయ్యా. ఆ చీకటి రోజుల నుంచి బయటపడితేనే జీవితంలో విజయం సాధిస్తాం” అని తెలిపింది.

Read Also : Temasek: భారత్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్దమైన టెమాసెక్