Samantha : ఎల్లి కవర్ పేజ్ పై సమంత హంగామా..!

తనలో ఉన్న ఫైర్ ని చూపిస్తుంది అమ్మడు. ఒక మంచి ఛాన్స్ వస్తే సమంత మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంది

Published By: HashtagU Telugu Desk
Samantha Elle Cover Page Photoshoot

Samantha Elle Cover Page Photoshoot

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Heroine Samantha) సినిమాల విషయంలో దూకుడు చూపించట్లేదు కానీ ఫోటో షూట్స్ తో మాత్రం పిచ్చెక్కిస్తుంది. మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్న అమ్మడు తెలుగు లో కన్నా బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లు లైన్ లో పెడుతుంది. అక్కడ ఆల్రెడీ సిటాడెల్ సీరీస్ పూర్తి చేసిన సమంత రాజ్ అండ్ డీకేలతో మరో సీరీస్ చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈమధ్యనే తెలుగులో తన సొంత ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేసింది సమంత. ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అన్నది తెలియాల్సి ఉంది.

ఇక లేటెస్ట్ గా అమ్మడు ఎల్లి మేగజైన్ కవర్ పేజ్ (Elle Magazine Coverpage) కి స్టిల్ ఇచ్చింది. ఎల్లి పేజ్ పై సమంత డ్యాషింగ్ లుక్ ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఇప్పటికీ తనలో ఉన్న ఫైర్ ని చూపిస్తుంది అమ్మడు. ఒక మంచి ఛాన్స్ వస్తే సమంత మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంది. విజయ్ తో చేసిన ఖుషి (Khushi) సినిమా టైం లో మయోసైటిస్ వల్ల సరిగా ఇంప్రెస్ చేయలేకపోయింది.

ఐతే ఇప్పుడు పూర్తిగా కోలుకున్న సమంత ఇప్పుడు ఛాన్స్ వస్తే తన 100 పర్సెంట్ ఇవ్వాలని అనుకుంటుంది. అలాంటి ఆఫర్ కోసం అమ్మడు ఎదురుచూస్తుంది. ఐతే సమంత ఎదురుచూస్తున్నా సరే ఆఫర్లు మాత్రం రావట్లేదు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సమంత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాఫట్లేదని ఫీల్ అవుతుంది సమంత.

స్టార్ ఛాన్సులు కాకపోయినా టైర్ 2 హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా సరే చేసేందుకు రెడీ అంటుంది సమంత. కానీ ఎందుకో తెలుగు మేకర్స్ సమంతని సైడ్ చేసి కొత్త హీరోయిన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మా ఇంటి బంగారం రిలీజ్ అయితేనే కానీ సమంత టాలెంట్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మళ్లీ అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి సమంత చేయబోయే నెక్స్ట్ స్టార్ సినిమా ఏదవుతుంది అన్నది చూడాలని ఆమె ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  Last Updated: 15 Jul 2024, 10:25 PM IST