Site icon HashtagU Telugu

Sam : దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న సమంత..ఒక్కతే వెళ్లిందా..? లేక అతడు కూడా ఉన్నాడా..?

Sam Dubai

Sam Dubai

టాలెంటెడ్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం దుబాయ్‌ వెకేషన్ (Dubai Vacation) ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల అక్కడ జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమె, ఆ తర్వాత ప్రకృతి అందాల మధ్య ప్రశాంతతను ఆస్వాదిస్తూ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత, తన తాజా ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. “శబ్దం లేదు.. హడావుడి లేదు.. ఉండడానికి ప్లేస్ మాత్రమే” అనే క్యాప్షన్‌తో ఆమె ఇచ్చిన సందేశం, ఆమె మానసికంగా రిలాక్స్‌ అవుతున్నదనడానికి ఉదాహరణగా మారింది.

‘RT 76’ : సంక్రాంతి రేసులో రవితేజ

ఇక ఈ వెకేషన్ ట్రిప్‌కి సంబంధించి మరో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సమంత ఈ ట్రిప్‌కు ఒక్కతే వెళ్లిందా లేక ఆమెతో పాటు దర్శకుడు రాజు నిడుమోరు కూడా ఉన్నారా అన్నది నెటిజన్ల ప్రశ్న. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వ్యక్తిగత విషయాల్లో ఎంతో గోప్యత పాటిస్తుండగా, తాజాగా బాలీవుడ్ మీడియాలో రాజు నిడుమోరు(Raju Nidimoru)తో ఆమెకు సంబంధం ఉందనే వార్తలు తెగ ప్రచారం చేస్తుంది. వీరిద్దరూ ‘ఫ్యామిలీ మ్యాన్’ తర్వాత ‘సిటాడెల్’ సిరీస్‌లో కలిసి పని చేయడం, జిమ్‌, పికిల్ బాల్ వీడియోల్లో కలిసి కనిపించడం, వీరి మధ్య సంబంధం ఉందన్న ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది.

NTR -Neel : 2 వేల మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన డైరెక్టర్

అయితే ఈ వార్తల్లో నిజమెంత? అనే అంశం మిస్టరీగా ఉంది. రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లయినప్పటికీ, ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చి సమంతను వివాహం చేసుకోనున్నారని బాలీవుడ్ టాక్. ‘శుభం’ సినిమాకు సమంత నిర్మాతగా ఉండగా, అదే సినిమాకు రాజు కూడా కో-ప్రొడ్యూసర్‌గా ఉండటం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. మరి నిజంగా వీరు ప్రేమలో ఉన్నారా..? ఉంటె పెళ్లి వరకు వెళ్తారా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.