Samantha : సమంత గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలు వదిలేసి బిజినెస్ మీద దృష్టి పెట్టింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లోకి వస్తుంది. ఇటీవల ఎప్పుడో తీసిన సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత చేతిలో ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా ఒక్కటే ఉంది. దానికి సమంతనే నిర్మాత. బాలీవుడ్ లో రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ చేస్తుంది.
అయితే తాజాగా సమంత ఇంకో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. సమంత బెస్ట్ ఫ్రెండ్, డైరెక్టర్ నందిని రెడ్డి గతంలో సమంత తో జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు చేసింది. జబర్దస్త్ ఫ్లాప్ అవ్వగా ఓ బేబీ హిట్ అయింది. అయితే ఈ రెండు సినిమాలు రీమేక్ లు కావడం గమనార్హం. ఓ బేబీ తర్వాత నందిని రెడ్డి మళ్ళీ ఇప్పటిదాకా హిట్ కొట్టలేదు. ఇప్పుడు మళ్ళీ సమంతతో సినిమా చేయడానికి సిద్ధమైంది.
తాజాగా ఐఫా ఈవెంట్ లో నందిని రెడ్డి సమంతతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది. సమంత ప్రస్తుతం ఫ్లాప్స్ లోనే ఉంది. నందిని రెడ్డి గత సినిమా కూడా ఫ్లాప్. మరి వీరిద్దరూ కలిసి సొంత కథతో ఎలాంటి సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పిస్తారో చూడాలి. ఇక ఈ సినిమా ఎప్పటికి మొదలవుతుందో, ఎప్పుడు వస్తుందో చూడాలి.
Also Read : Nidhhi Agerwal : ప్రభాస్ ‘రాజాసాబ్’ లో నేను దయ్యం కాదు కానీ.. నిధి అగర్వాల్ కామెంట్స్..