Site icon HashtagU Telugu

Samantha : మయోసైటిస్ ట్రీట్మెంట్‌కు 25 కోట్ల ఖర్చు.. కౌంటర్ ఇచ్చిన సమంత..

Samantha counter on her Myositis Treatment spending News

Samantha counter on her Myositis Treatment spending News

సమంత(Samantha) మళ్ళీ ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చేతిలో ఉన్న ఖుషి(Kushi) సినిమా, సిటాడెల్(Citadel) సిరీస్‌లు షూట్ అయిపోవడంతో సమంత ప్రస్తుతం సినిమాలకు సంవత్సరం పాటు బ్రేక్ ఇచ్చింది. ఈ గ్యాప్‌లో తన హెల్త్‌పై ఫోకస్ చేయాలని, మయోసైటిస్‌(Myositis)ని పూర్తిగా తగ్గించుకోవాలని డిసైడ్ అయింది.

సమంత మయోసైటిస్ ట్రీట్మెంట్‌కు అమెరికాకు వెళ్తుందని సమాచారం. అయితే ట్రీట్మెంట్‌కు వెళ్లేముందు కొన్ని రోజులు మానసిక ప్రశాంతత కోసం ప్రస్తుతం డివోషనల్, నేచర్ టూర్స్ వేస్తుంది సామ్. ప్రస్తుతం ఇండోనేషియా బాలిలో ప్రకృతి ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది. అయితే సమంత మయోసైటిస్ ట్రీట్మెంట్‌కు 25 కోట్లు ఖర్చు పెడుతుందని, కొంత డబ్బు అప్పు కూడా చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు సమంత వరకు వెళ్లడంతో దీనిపై స్పందించింది.

ఈ 25 కోట్ల వార్తలపై సమంత స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. తన పోస్ట్ లో.. మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం 25 కోట్లా? మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉన్నారు. నేను అందులో చాలా అంటే చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాను. నేను సంపాదించుకున్నాను. నా గురించి నేను చూసుకోగలను. మయోసైటిస్ వల్ల బాధపడేవాళ్లు చాలా మంది ఉంటారు. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా తప్పుడు వార్తలు రాస్తే నిజంగానే అంత ఖర్చు అవుతుందేమో అని ట్రీట్మెంట్‌కి రారు. కొంచెం బాధ్యతగా ఉండండి అంటూ కౌంటర్ ఇచ్చింది సమంత.

 

Also Read : Krishna : బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు.. హాజరైన కుటుంబ సభ్యులు..