Samantha Reaction: ప్రేమకు విలువ ఇవ్వనివారికి కన్నీళ్లే మిగులుతాయి: ‘చైతూ-శోభితా’ డేటింగ్ పై సమంత కామెంట్స్

మొదటిసారి సమంత నాగచైతన్య, శోభితా డేటింగ్ రూమర్స్ పై కామెంట్స్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Naga Chaitanya

Naga Chaitanya

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి సమంత వారిద్దరి డేటింగ్ పై రియాక్ట్ అయ్యింది. దేవ్ మోహన్‌తో చేయబోయే శాకుంతలం చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. అయితే మొదటిసారి సమంత నాగచైతన్య, శోభితా డేటింగ్ రూమర్స్ పై కామెంట్స్ చేసింది.

ఎవరెవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారనే బాధ నాకు లేదని.. ప్రేమకు విలువ ఇవ్వని వారు ఎంతమందితో కలిసినా కన్నీళ్లే మిగులుతాయని.. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలని. తన ప్రవర్తన మార్చుకుని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది అని సమంత చెప్పినట్లు సన్నిహితులు చెబుతున్నారు. తన ప్రవర్తన మార్చుకుని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది’’ అన్నారు. విడాకుల తర్వాత తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, స్నేహితులు అండగా నిలిచారని సమంత చెప్పింది.

గతంలో సమంతా మీడియా ఇంటరాక్షన్ సమయంలో తన విడాకుల గురించి మాట్లాడింది. విడాకుల తర్వాత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు, ప్రతికూల పరిస్థితుల్లో తనకు తాను ధైర్యం చెప్పుకున్నట్టు కూడా తెలిపారు. అయితే  నాలుగు సంవత్సరాల వివాహం తర్వాత సమంత, నాగచైతన్య అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట విడిపోయి నెలలు గడుస్తున్నపటికీ నిత్యం వార్తలో నిలుస్తుండటం గమనార్హం. ప్రస్తుతం సమంత శాకుంతలం మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఏప్రిల్ 14 న విడుదల కానుంది. విజయ్ దేవరకొండతో ఖుషీ, వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ వెబ్ సిరీస్ తో సమంత బిజీగా ఉంది.

Also Read: Pawan Kalyan: దసరాకు పవన్ మూవీ కష్టమే.. క్లైమాక్స్ దశలోనే ‘హరిహర వీరమల్లు’

  Last Updated: 04 Apr 2023, 12:05 PM IST