Samantha Josh : హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన సమంత.. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ తో!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. నాగచైతన్యతో విడాకుల వ్యవహరం తర్వాత దూకుడు పెంచింది. కొద్దిరోజుల క్రితం వరుసగా విహార యాత్రలకు వెళ్తూ.. పార్టీలు, ఫంక్షన్లకు అటెండ్ అవుతూ తనను తాను రీచార్జ్ చేసుకుంది.

  • Written By:
  • Publish Date - November 26, 2021 / 12:46 PM IST

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. నాగచైతన్యతో విడాకుల వ్యవహరం తర్వాత దూకుడు పెంచింది. కొద్దిరోజుల క్రితం వరుసగా విహార యాత్రలకు వెళ్తూ.. పార్టీలు, ఫంక్షన్లకు అటెండ్ అవుతూ తనను తాను రీచార్జ్ చేసుకుంది. విహారయాత్రల తర్వాత సమంత పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేస్తోంది. వరుసగా సినిమాలు కమిట్ అవుతూ వేగం పెంచుతోంది. ఇప్పటికే రెండు మూడు సినిమాలకు ఓకే చెప్పినా సమంత తాజాగా హలీవుడ్ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత సమంత ఆడిషన్ కు అటెండ్ కావడం విశేషం.

సమంత కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా దూసుకుపోతోంది. అవును ఆమె తన నెక్ట్స్ మూవీ ఇప్పుడే ప్రకటించింది. ‘డౌన్‌టౌన్ అబ్బే సిరీస్’కి ప్రసిద్ధి చెందిన బాఫ్టా-విజేత దర్శకుడు ఫిలిప్ జాన్‌తో. ఆమె దర్శకుడితో చిత్రాన్ని పంచుకుంది. 11 సంవత్సరాల తర్వాత తాను ఆడిషన్‌కు భయపడుతున్నట్లు పేర్కొంటూ ఒక నోట్‌ను రాసింది. ఈ చిత్రం ప్రఖ్యాత నవలా రచయిత టైమేరి ఎన్ మురారి నుంచి స్వీకరించబడిన నవల అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ ఆధారంగా రూపొందింది. సమంత నటించిన ఓ బేబీ చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి భారతీయ సంస్థ గురు ఫిల్మ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను కూడా నిర్మిస్తోంది.

డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతున్న 27 ఏళ్ల వయస్సు గల అమ్మాయిగా నటిస్తుందని, ఆమె ఒక ప్రోగ్రెసివ్ ద్విలింగ (బై సెక్సువల్) తమిళ మహిళ. ట్రెడిషనల్ ఫ్యామిలీ. కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే తల్లిదండ్రులు. పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. కానీ ఆమె మాత్రం తనదైన జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. “ఈ రోజు నేను నా ప్రయాణాన్ని ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’తో ప్రారంభించినప్పుడు నాకు సరికొత్త ప్రపంచం లో వెళ్తున్నట్టు ఉంది. “ఫిలిప్ జాన్‌తో కలిసి పనిచేయడానికి సంతోషిస్తున్నాను, అతని ప్రాజెక్స్ లను చాలా సంవత్సరాలుగా ఫాలో అయ్యాను, ‘డోన్టన్ అబ్బే’కి పెద్ద అభిమానిని.