సమంత పెద్ద ఛీటారట (Samantha Cheater)..ఈ విషయాన్నీ స్వయంగా విజయ్ దేవరకొండ (Vijay devarakonda)నే తెలిపాడు. వీరిద్దరి కలయికలో రెండో సినిమా వస్తుంది..అదే ఖుషి (Kushi). గతంలో వీరిద్దరూ కలిసి మహానటి మూవీ లో నటించారు. ఇక ఇప్పుడు మరోసారి జతగా రాబోతున్నారు. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 1 న తెలుగు తో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అంచనాలు మొదలయ్యాయి..ఆ తర్వాత మజిలీ ఫేమ్ శివ డైరెక్టర్ అనగానే అంచనాలు రెట్టింపు అయ్యాయి..ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ , స్టిల్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి.
ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ వరుస ఇంటర్వూస్ (Samantha Vijay Devarakonda Interview) చేస్తూ వస్తుంది. తాజాగా టాప్ యాంకర్ సుమ (Suma)..చిత్ర యూనిట్ ను ఇంటర్వ్యూ చేయగా..పలు ఆసక్తికర విషయాలను విజయ్ ..సమంత లు తెలియజేసారు. విజయ్, సమంత లను సుమా రాపిడ్ ఫైర్ లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇందులో భాగంగానే ఓ సందర్భంలో విజయ్.. ‘సమంత చాలా చీటింగ్ చేస్తుందని’ కామెంట్స్ చేశాడు. “నేను సమంత బోర్డ్ గేమ్స్ ఆడుతుంటే తను చాలా చీటింగ్ చేసి ఆడుతుంది. జెన్యూన్ గా ఒక ఇన్సిడెంట్ లో నాకు సామ్ ఇంటలిజెన్స్ తెలిసింది. నేను చాలా ఇంటలిజెంట్ అని నా ఫీలింగ్. కానీ సామ్ ఇంటెలిజెన్స్ నాకు తెలిసింది. బోర్డ్ గేమ్స్ లో ఎంత చీటింగ్ చేస్తుందంటే, ఆ చీటింగ్ యాక్సెప్ట్ చేసే విధంగా కూడా ఉండదు, అంత చీటింగ్ చేస్తుంది. అంటూ సామ్ ఫై సరదా గా విజయ్ కామెంట్స్ చేసాడు.
Read Also : Naga Chaitanya: సమంత, విజయ్ మధ్య రొమాంటిక్ సీన్స్.. థియేటర్ నుంచి చైతూ వాకౌట్
ఆ తర్వాత సమంత కి నచ్చని ఫుడ్ ఏంటని? సుమా అడిగితే.. ‘ఆమెకు మాంసం అంటే అసలు నచ్చదని’ విజయ్ ఆన్సర్ ఇచ్చారు. విజయ్ కి నచ్చని ఫుడ్ ఏంటని? సమంతని అడిగితే..’ ఎక్కువగా స్వీట్ ఉన్న ఐటమ్స్ విజయ్ కి నచ్చవని సామ్ రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత రాపిడ్ ఫైర్ లో భాగంగా సమంతకు ఇష్టమైన హీరో ఎవరు?అని సుమ విజయ్ ని అడిగింది. అందుకు విజయ్ బదులిస్తూ.. ‘‘సమంత ఫేవరెట్ హీరో నేను మాత్రమే’’ అని చెప్పడంతో సమంత కూడా కరెక్ట్ అని బదులిచ్చింది. విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని? సమంతని అడిగితే ఆలియా భట్ అని వెంటనే ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఫేవరెట్ యాంకర్ ఎవరని? సుమ సరదాగా అడిగితే.. ‘‘ఇప్పుడున్న యాంకర్స్ లో నాకు మీరు తప్ప మరెవరూ తెలియదు’’ అని విజయ్ చెబితే సమంత మాత్రం కరణ్ జోహార్ అని సమాధానం ఇచ్చింది. ఓవరాల్ గా ఈ ఇంటర్వ్యూ తాలూకా వీడియోస్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.