సౌత్ స్టార్ హీరోయిన్ సమంత దీపావళి సెలబ్రేషన్స్ (Diwali Celebrations) ని ఒక ప్రత్యేకమైన ప్లేస్ లో షేర్ చేసుకుంది. దీపవళి అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అందుకే దీపాల వెలుగులతో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది సమంత. సమంత దీపావళి సెలబ్రేషన్స్ ను రాజస్థాన్ లొని బర్వార సిస్ సెన్సెస్ ఫోర్ట్ లో జరుపుకున్నారు. అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో సమంత పండుగ సెలబ్రేట్ చేసుంది.
అంతేకాదు తన సోషల్ మీడియాలో ఈ ఫోటోలు పెట్టి తన చుట్టుపక్కన ప్రేమ ఇంకా శక్తిని ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు తన ఫ్యాన్స్ కోసం ప్రేమ, ఆనందంతో కూడిన దీపావళి శుభాకాంక్షలు అని మెసేజ్ పెట్టింది. సమంత (Samantha) ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని ఆమె ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
ఇక దీపావళి సెలబ్రేషన్స్ లో సమంత గ్రే కలర్ కుర్తా పాంట్ ధరించింది. పెద్దగా హంగామా ఏమి లేకుండానే పండుగ జరుపుకుంది సమంత. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే మా ఇంటి బంగారం అనే ప్రాజెక్ట్ చేస్తున్న సమంత సిటాడెల్ (Citadel) వెబ్ సీరీస్ చేస్తుంది.
సౌత్ సినిమాల కన్నా అమ్మడు ఎక్కువగా బాలీవుడ్ సినిమాల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. పర్సనల్ లైఫ్ లో ఏం జరిగినా సరే తన పంథాలో తాను దూసుకెళ్తున్న సమంత మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది.
Also Read : Air Quality: దీపావళి తర్వాత క్షీణించిన గాలి నాణ్యత.. టాప్-10 నగరాలివే!