Samantha At Top: వెండితెరపై ‘సమంత’ జోరు!

హీరోయిన్స్ అనగానే చాలామంది బాలీవుడ్ వైపే చూస్తారు. ఇతర ఇండస్ట్రీ హీరోయిన్స్ ఎవరైనా బాలీవుడ్ ముందు తేలిపోయేవారు.

  • Written By:
  • Updated On - June 25, 2022 / 03:53 PM IST

హీరోయిన్స్ అనగానే చాలామంది బాలీవుడ్ వైపే చూస్తారు. ఇతర ఇండస్ట్రీ హీరోయిన్స్ ఎవరైనా బాలీవుడ్ ముందు తేలిపోయేవారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ అన్ని భాషల్లో దూసుకుపోతున్నారు. ‘ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్’ రిపోర్ట్స్ ప్రకారం దక్షిణాది తారలు జనాదరణ పొందడంలో ముందుంటున్నారని స్పష్టం చేసింది. టాప్ 10 మహిళా తారల జాబితాలో 5 తెలుగు, 3 హిందీ, 2 తమిళ తారలు చోటు దక్కించుకున్నారు. అయితే ఈ లిస్ట్‌లో సమంత టాప్ ప్లేస్ దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాతి స్థానంలో అలియా భట్ ఉంది. ఆలియా భట్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ ముగ్గురు బాలీవుడ్ పేర్లు జాబితాలో ఉన్నారు. ఆలియా రెండో స్థానంలో ఉండగా, దీపిక ఐదో స్థానంలో, కత్రినా ఏడో స్థానంలో నిలిచారు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఇతర తారలలో నయనతార మూడవ స్థానంలో, కాజల్ అగర్వాల్ ఐదవ స్థానంలో, కీర్తి సురేష్ ఆరవ స్థానంలో, రష్మిక, పూజా హెగ్డే, అనుష్క శెట్టి వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నారు.

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది సమంత. అందుకే ఆమె భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా హీరోయిన్ గా అవతరించింది. Ormax రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, సమంతా ప్రభు ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఇతర బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. పలు భాషల్లోని సినిమా ప్రేక్షకులు ఒక్కో భాషలో తమ అభిమాన తారల పేర్లను విడివిడిగా చెప్పమని కోరడం జరుగుతుంది. ప్రతి నెలా 10,000 మందికి పైగా ఈ సర్వేలో పాల్గొంటారు. అయితే అత్యధిక మంతి సమంతకే ఓటు వేశారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో విరోధి రాజి, పుష్ప స్పెషల్ సాంగ్ తో అభిమానులను విశేషంగా ఆకర్షించింది.

తన నటనతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది సమంత. ఆమె లుక్స్, డ్రైస్సింగ్ స్టయిల్, ఫ్యాషన్ సెన్స్ అభిమానులను విపరీతంగా సంపాదించిపెట్టాయి. ‘ఏ మాయ చేసావే’ లోని జెస్సీ నుంచి, ఊ అంటావా వరకు.. ప్రతి పాత్రలో తనను తాన్ ప్రూవ్ చేసుకుంటూ తనకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. పుష్పతో ఇతర హీరోయిన్స్ ను డామినేట్ చేసింది. అందుకే సమంత ఇతర హీరోయిన్స్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ దక్కించుకుంది.