Site icon HashtagU Telugu

Samantha Apologizes: విజయ్ దేవరకొండ అభిమానులకు సమంత క్షమాపణ

Samantha apologizes

Sam Viajy

సమంతా (Samantha) విజయ్ దేవరకొండతో కలసి నటించే ఖుషీ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. రొమాంటిక్ డ్రామా కథతో ఈ సినిమా తీస్తుండడం తెలిసిందే. సమంత ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన మయోసైటిస్ బారిన పడడంతో ఖుషీ సినిమా షూటింగుకి అంతరాయం కలిగింది.

విజయ్ తో కలసి సమంత (Samantha) లోగడ మహానటిలో చేసింది. రెండో సారి మళ్లీ విజయ్ తో ఖుషీ కోసం జత కడుతోంది. కశ్మీర్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను గతేడాది షూట్ చేశారు. అనంతరం మయోసైటిస్ సమస్య బారిన పడడంతో సమంత చికిత్స కోసం విరామం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఖుషీ షూటింగ్ ఆగిపోయింది.

షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అంటూ ఓ అభిమాని ట్విట్టర్ లో ప్రశ్నించగా.. దానికి సమంత బదులిచ్చింది. త్వరలోనే మొదలవుతుందని చెబుతూ, విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు (సినిమా ఇంతకాలం నిలిచిపోయినందుకు) అంటూ ట్వీట్ చేసింది. దీనికి అభిమానులు స్పందిస్తూ ముందు ఆరోగ్యం జాగ్రత్త అంటూ సూచనలు ఇచ్చారు.

Also Read:  Keerthy Suresh Marriage: కీర్తి సురేశ్ పెళ్లి వార్తలపై ఆమె తల్లి క్లారిటీ!