టాలీవుడ్ ప్రముఖ నటి సమంత , ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరూ గతంలో పలు సందర్భాల్లో కలిసి కనిపించడం, మీడియా కంట పడటం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. సామ్, రాజ్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, అభిమానుల్లో చర్చకు దారితీశాయి.
తాజాగా ఈ జంట మరోసారి కెమెరా కంటికి చిక్కింది. ముంబైలో డిన్నర్ డేట్ కోసం సమంత, రాజ్ నిడిమోరు ఒకే కారులో రావడం కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. వీరిద్దరూ నవ్వుతూ, సరదాగా మాట్లాడుకుంటూ కారులో నుంచి దిగడం స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ఇది వారిద్దరి మధ్య ఉన్న సంబంధంపై వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
Immigrants : ప్రపంచవ్యాప్తంగా వలసదారుల్లో ముందంజలో భారతీయులు: ఐక్యరాజ్యసమితి నివేదిక
ఈ సంఘటనతో పాటు పలు మీడియా సంస్థలు సమంత, రాజ్ నిడిమోరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు ప్రచురించడం గమనార్హం. గతంలో కూడా వీరి పెళ్లి గురించి పలు కథనాలు వచ్చినా, వాటిపై ఇరువురూ ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు తాజా వీడియో, మీడియా నివేదికలు ఈ పుకార్లకు మరింత వేడిని పెంచాయి. అయితే ఈ వార్తలపై సమంత గానీ, రాజ్ నిడిమోరు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వారిద్దరూ కలిసి పనిచేసిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ తర్వాత నుంచే వీరి అనుబంధంపై చర్చ మొదలైంది. మరి ఈ పుకార్లలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే, వారిద్దరి నుండి అధికారిక స్పందన వచ్చేవరకు వేచి చూడాలి.
#SamanthaRuthPrabhu spotted with her rumoured boyfriend Raj Nidimoru in Mumbai. 🤔pic.twitter.com/xWcx2KSEcH
— Films Spicy (@Films_Spicy) July 31, 2025