Samantha : చాలాకాలం తర్వాత అక్కినేని ఫ్యామిలీలో ఒకరితో హీరోయిన్ సమంత కలిసి దర్శనమివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హీరో నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారిగా అక్కినేని ఫ్యామిలీలో ఒక వ్యక్తితో కలిసి ఓ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. ఇప్పుడు సినీ ప్రియులు అందరూ ఈ టాపిక్‌పైనే చర్చించుకుంటున్నారు. వివరాలివీ..
Also Read :China Sketch : చైనా, పాకిస్తాన్‌లకు తోడుగా ఆఫ్ఘనిస్తాన్.. డ్రాగన్ బిగ్ స్కెచ్ !
సమంత స్పీచ్.. అమల చప్పట్లు
ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానల్ (జీ తెలుగు) ఇటీవలే ఓ అవార్డ్ ఫంక్షన్‌ను నిర్వహించింది. అది మహిళలకు సంబంధించిన ప్రత్యేక పురస్కార ప్రదానోత్సవం. వివిధ రంగాల్లో రాణిస్తున్న వనితలకు ఈ అవార్డులను అందించారు. ఈ ప్రోగ్రాంకు సమంత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమంత ప్రసంగిస్తూ ఎమోషనల్ అయ్యారు. మానవ జీవితంతో ముడిపడిన మోటివేషనల్ అంశాలను ఈసందర్భంగా ఆమె వివరించారు. తన జీవితంలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వచ్చాయనేది చెప్పారు. కెరీర్‌లో ఎదిగే క్రమంలో ఒడిదుడుకులను ఫేస్ చేసిన తీరును సమంత(Samantha) గుర్తు చేసుకున్నారు. ఈ ప్రసంగాన్ని విని .. అవార్డ్ ఫంక్షన్‌కు హాజరైన వాళ్లంతా చప్పట్లు కొట్టారు. ఒక ప్రత్యేక అతిథి కూడా చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టి సమంతను అభినందించారు. ఆమె మరెవరో కాదు.. అక్కినేని అమల.
Also Read :Chhattisgarh Encounter : అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి హతం.. ఎవరీ కేశవరావు?
మే 24న జీ తెలుగులో చూడండి..
మూవీ ఇండస్ట్రీలో 15 ఏళ్లను పూర్తి చేసుకున్నందుకు సమంతకు అవార్డు ఇచ్చారు. 30 ఏళ్లకుపైగా జంతు సంరక్షణ రంగంలో సేవలు అందిస్తున్నందుకు అక్కినేని అమలకు అవార్డు ప్రదానం చేశారు. మొత్తం మీద సమంత, అక్కినేని అమల కలిసి పాల్గొనడంతో ఒక్కసారిగా ఈ కార్యక్రమం రేటింగ్ పెరిగిపోయింది. మంగళవారం రోజు(మే 20న) ఈ అవార్డ్స్ ఫంక్షన్‌కు సంబంధించిన ప్రోమోను జీ తెలుగు రిలీజ్ చేసింది. దీనికి 24 గంటల్లోనే 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.మే 24న సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రసారం అవుతుంది.