Samantha : అదిరిపోయే సమంత యాక్షన్.. సిటాడెల్ సిరీస్ ట్రైలర్.. ప్రేక్షకుల ముందుకు త్వరలో సమంత..

సిటాడెల్ హనీ బన్నీ ట్రైలర్ లో సమంత వరుణ్ ధావన్ తో కలిసి యాక్షన్ అదరగొట్టేసింది.

Published By: HashtagU Telugu Desk
Samantha Amazon Prime Citadel Honey Bunny Trailer Released

Citadel Series

Samantha : మయోసైటిస్ సమస్యతో కొన్నాళ్ళు సినిమాలకు దూరమవుతాను అని ప్రకటించిన సమంత ఓ పక్క చికిత్స తీసుకుంటున్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంది. ఇప్పటికే కోలుకున్న సమంత తన ఆరోగ్యంపై మరింత ఫోకస్ పెట్టింది. చివరగా సమంతా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఆమెను తెరపై ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు.

అయితే వెండితెరపై కాకపోయినా బుల్లితెరపై త్వరలోనే చూడొచ్చు. మయోసైటిస్ రాకముందు సమంత వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. హాలీవుడ్ లో వచ్చిన సిటాడెల్ సిరీస్ రీమేక్ గా ఇండియాలో సిటాడెల్ హనీ బన్నీ అనే పేరుతో రాజ్ & డీకే దర్శకత్వంలో తెరకెక్కించారు. యాక్షన్ థ్రిల్లర్ తో ఈ సిరీస్ సాగనుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి టీజర్ రాగా తాజాగా ట్రైలర్ విడుదల చేసారు.

సిటాడెల్ హనీ బన్నీ ట్రైలర్ లో సమంత వరుణ్ ధావన్ తో కలిసి యాక్షన్ అదరగొట్టేసింది. ఇక ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది. దీంతో సమంత ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చెసాతున్నారు. మీరు కూడా సమంత సిటాడెల్ హనీ బన్నీ ట్రైలర్ చూసేయండి..

 

Also Read : NTR : దేవర హిట్ అయినందుకు.. పెద్ద లెటర్ రాసి అందరికి థ్యాంక్స్ చెప్పుకొచ్చిన ఎన్టీఆర్..

  Last Updated: 15 Oct 2024, 04:19 PM IST