Site icon HashtagU Telugu

Samantha : ఏంటి సామ్ ఏజ్ 23 ఏళ్లేనా..?

Sam Age 23

Sam Age 23

సమంత (Samantha) ..ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయచేసావే..అంటూ వచ్చి యూత్ అందర్నీ మాయ చేసింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ భామ..ఆ తర్వాత వరుస పెట్టి అగ్ర హీరోలతో జత కట్టి అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోను సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న సమయంలోనే తన ప్రేమాయణం బయటపెట్టి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమించిన మొదటి హీరో చైతు నే పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగిపోయింది. విడాకుల అనంతరం మయోసైటిస్ (Myositis) బారిన పడి అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం ఈ వ్యాధి నుండి ప్రాణాలతో బయటపడినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం కోలుకోలేదు. అందుకే సినిమాలు చేయడం మానేసి పూర్తిగా ఆరోగ్యం ఫై శ్రద్ద పెట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. ఎక్కువగా ఆరోగ్యానికి సంబదించిన విషయాలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. రీసెంట్​గా తనలా ఎవరూ అనారోగ్యాల బారిన పడకూడదని టేక్‌ 20 అనే హెల్త్‌ పాడ్‌ కాస్ట్​ (Take 20 )ను ప్రారంభించి మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. తాజాగా తన వర్కౌట్​కు సంబంధించిన ఫొటోస్​ను షేర్ చేసింది. తన చుట్టూ ఉన్న లొకేషన్లను చూపించింది. ఇంకా ఈ పోస్ట్​లో తన ఆరోగ్యానికి సంబంధించిన రాసుకొచ్చింది. అందులో సామ్​ మెటబాలిక్ ఏజ్ కూడా రాసి ఉంది. తన వయసు కేవలం 23 ఏళ్ళు అని అందులో కనిపించింది. అలానే తన బరువు 50 కేజీలు, ఫ్యాట్, బోన్స్, BMR ఇలా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు పోస్ట్ చేసింది.సామ్ మెటబాలిక్ ఏజ్ 23 ఏళ్ళే అని చూసిన నెటిజన్లు అభిమానులు షాక్ అండ్ సర్​ప్రైజ్ అవుతున్నారు.

Read Also: Shami Ruled Out: ఐపీఎల్‌కు మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ దూరం..!