Samajavaragamana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సామజవరగమన, స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

ఈ సంవత్సరంలో అత్యంత వినోదాత్మకమైన మూవీగా సామజవరగమన నిలిచింది.

  • Written By:
  • Updated On - July 21, 2023 / 12:24 PM IST

ఈ సంవత్సరంలో అత్యంత వినోదాత్మకమైన మూవీగా సామజవరగమన నిలిచింది. కుటుంబ ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జూలై 28 నుంచి ఆహాలోకి ఈ మూవీ రాబోతోంది. సామజవరగమన వినోదం, శృంగారం, నాటకం, హాస్యం అనేక అంశాలతో రూపుదిద్దుకున్న మూవీ. టాలెంటెడ్ శ్రీవిష్ణు, రెబా మోనికా జోగన్, నరేష్ తదితరులు నటించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లో టికెట్ విక్రేతగా పనిచేసే బాలుగా నటిస్తాడు. అతని తండ్రి, ఉమా మహేశ్వర రావు (నరేష్), తన డిగ్రీని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. పరీక్ష హాలులో సరయు (రెబా మోనికా జాన్)ని కలుస్తాడు.

సరయు తర్వాత ఉమ ఇంటికి పేయింగ్ గెస్ట్‌గా వస్తుంది. సాధారణంగా అమ్మాయిలందరినీ అక్కాచెల్లెళ్లలా చూసుకునే బాలుతో ప్రేమలో పడుతుంది. చివరికి, బాలు కూడా ఆమె పట్ల భావాలను పెంచుకుంటాడు. తర్వాత ఏమి జరుగుతుంది అనే స్టోరీ ఈ మూవీ తెరకెక్కింది. 2023 ద్వితియార్ధంలో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ చిత్రం ఫస్ట్‌ వీకెండ్‌లోనే రూ.19.8 కోట్లు వసూళ్‌ చేసి మంచి విజయం సాధించింది. ఈ సినిమా హక్కులను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా (AHA) దక్కించుకుంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ.. “నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, సామజవరగమన దానికి చక్కటి రూపం, ఇక నో ఆలస్యం…ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం” అంటూ ట్విట్ట‌ర్‌లో తెలిపింది.

Also Read: Kishan Reddy: నేడు బీజేపీ పార్టీ పగ్గాలు చేపట్టనున్న కిషన్ రెడ్డి