Site icon HashtagU Telugu

Poonam Pandey Death Stunt: పూనమ్ పాండే అలా చేయడంలో తప్పేముంది: భర్త

Poonam Pandey

Poonam Pandey

Poonam Pandey Death Stunt: పూనమ్ పాండే మరణవార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 32 ఏళ్ళ వయసులో ఆమె మరణ వార్త సినీ వర్గాల్లో ఆందోళన రేపింది. క్యాన్సర్ కారణంగా పూనమ్ మృతి చెందినట్లు ఆమె సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టడంతో నిజమేనని అందరూ అనుకున్నారు. అయితే సరిగ్గా 24 గంటల తర్వాత పూనమ్ సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పింది. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఇదంతా చేశామంటూ బాంబ్ పేల్చింది. దీంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన చీప్ ట్రిక్స్ పై మండిపడుతున్నారు. కాగా పూనమ్ పాండే భర్త సామ్ బాంబే తాజాగా స్పందించాడు. ఈ క్రమంలో భార్యకు మద్దతుగా నిలిచాడు.

సామ్ బాంబే హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె ఇలా చేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను.. ఆమె మరణ వార్త విన్నప్పుడు నా హృదయంలో ఎలాంటి మార్పు లేదు. నష్ట పోయానన్న భావన కలగలేదు. ఎందుకంటే మనం ఒకరికి కనెక్ట్ అయినప్పుడు ప్రతిదీ అనుభూతి చెందుతారు. నేను ప్రతిరోజూ పూనమ్ పాండే గురించి ఆలోచిస్తాను. ప్రతి రోజు ఆమె కోసం ప్రార్థిస్తాను. ఏదైనా జరిగితే నాకు తెలుస్తుందని భర్త సామ్ బాంబే ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యాడు.

మేము ఇంకా విడాకులు తీసుకోలేదని చెప్పాడు.ఎవరైనా తన స్టార్‌డమ్ మరియు ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ఒక సమస్యపై అవగాహన కల్పిస్తే వాళ్ళని గౌరవిద్దాం అని హితవు పలికారు. కాగా పూనమ్ మరియు సామ్ 2020 సంవత్సరంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లి జరిగిన 12 రోజులలోనే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.

Also Read: Electric Bike Tips: ఎలక్ట్రిక్ బైక్ లైఫ్ ని పెంచుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?