సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీసుకొచ్చిన హైడ్రా చట్టానికి సామాన్య ప్రజలే కాదు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా హైడ్రా (Hydra ) పేరు మారుమోగిపోతుంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ (CM Revanth Reddy) హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమాలు నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. కానీ ఇప్పుడు హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బడా ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..తాజాగా వందలమందికి నోటీసులు జారీ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
హైడ్రా అందరికి సమానమని నిరూపిస్తూ ముందుకు వెళ్తుండడం తో సామాన్య ప్రజలే కాదు సినీ ప్రముఖులు సైతం సీఎం రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం ఫై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ , జనసేన నేత నాగబాబు స్పందించగా..తాజాగా గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ ట్విట్టర్ చేసారు. హైడ్రా కు పూర్తి మద్దతు ఇస్తున్నానని.. దీన్ని తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఈ చర్య గొప్ప భవిష్యత్తు కోసం పునాదులను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఆక్రమణకు గురైన చెరువులు, నల్లాలను పునరుద్ధరించడంతో పాటు మూసీకి జీవం పోస్తుందన్నారు. ‘మీరు రాబోయే ఎన్నికల గురించి కాకుండా రాబోయే తరం గురించి ఆలోచించే వ్యక్తి’ అని సీఎం ఫై ప్రశంసలు కురిపించారు.
అంతకు ముందు నాగబాబు సైతం ట్విట్టర్ లో ..వర్షాలకు తూములు తెగిపోయి, చెరువులు, నాళాలు ఉప్పొంగిపోయి అపార్ట్మెంట్లలోకి కూడా నీళ్లు రావడం మనం చూస్తున్నాం. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడమే అని ట్వీట్ చేశారు. దీనికి నివారణగా సీఎం రేవంత్ ధైర్యంగా హైడ్రా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి అందరూ సపోర్ట్ చేయాలి అని ట్వీట్ చేశారు. ఇప్పటికైనా అర్థ అయ్యిందా సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా చేస్తున్న పని మంచిదే అన్నారు. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది… కచ్చితంగా…అంటూ నాగబాబు ట్వీట్ చేసారు.
Read Also : School Holidays: భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఏపీ విద్యాసంస్థలకు సెలవు