Site icon HashtagU Telugu

Saloni Aswani : మర్యాదరామన్న హీరోయిన్ సలోని గుర్తుందా? ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ..

Saloni Aswani Re Entry With Ananya Nagalla Main Lead Movie Tantra

Saloni Aswani Re Entry With Ananya Nagalla Main Lead Movie Tantra

‘ధన 51’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సలోని. ఆ తర్వాత ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, బాస్, మగధీర సినిమాల్లో మెరిపించింది. రాజమౌళి(Rajamouli) ‘మర్యాద రామన్న’(Maryada Ramanna) సినిమాతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. చివరిసారిగా 2016 లో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ఓ చిన్న సినిమాలో కనిపించింది సలోని. ఆ తర్వాత సలోని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

ఇప్పుడు ‘తంత్ర’(Thantra) చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు సలోని. ‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాల ఫేం అనన్య నాగళ్ల(Ananya Nagalla) ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వైజాగ్ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.

ఈ మేరకు దర్శకనిర్మాతలు సినిమా నాగురించి మాట్లాడుతూ.. ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న హారర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాథల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. తంత్ర శాస్ర్తానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలను ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నాం. ఇందులో అనన్య నాగళ్లతోపాటు ‘మర్యాదరామన్న’ ఫేం సలోని కీ రోల్‌ పోషిస్తున్నారు. గ్లామర్‌ పాత్రలతో మెప్పించిన సలోని ఇందులో డిఫరెంట్‌గా కనిపిస్తారు. నటనకు ఆస్కారమున్న పాత్ర అది. ఇటీవల అనన్యా, సలోని, హీరోపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. ఈ చిత్రం టీమ్‌ అందరికీ మంచి పేరు తీసుకురావడంతో పాటు సలోనికి మంచి కమ్‌బ్యాక్‌ అవుతుంది అని తెలిపారు.

 

Also Read : Allu Arjun National Award : బన్నీ కి నేషనల్ అవార్డు రావడం..ఆ హీరో జీర్ణించుకోలేకపోతున్నాడా..?