Site icon HashtagU Telugu

Salman Khan Death Threat: సల్మాన్ ను చంపేస్తా.. పోలీసులకు బెదిరింపు కాల్!

Salman Khan Rib Injury

Salman Khan Rib Injury

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ‘రోకీ భాయ్’ అనే వ్యక్తి నుండి నటుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan)కు సోమవారం రాత్రి హత్య బెదిరింపు వచ్చినట్లు ముంబై (Mumbai) పోలీసులు తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి ఏప్రిల్ 30 న నటుడిని చంపుతానని బెదిరించాడని,విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. “పోలీస్ కంట్రోల్ రూమ్.. నిన్న రాత్రి అందుకున్న ఓ కాల్‍లో ఓ వ్యక్తి తనను తాను రోకీ భాయ్ అని చెప్పుకున్నాడు. తాను రాజస్థాన్‍లోని జోధ్‍పూర్ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పాడు. ఏప్రిల్ 30న నటుడు సల్మాన్ ఖాన్‍ (Salman Khan) ను చంపుతానని బెదిరించాడు. ఈ విషయంపై విచారణ చేస్తున్నాం” అని ముంబై పోలీసులు వెల్లడించారు.

ఇటీవల గ్యాంగ్‍స్టర్ గోల్డీ బ్రార్ నుంచి కూడా సల్మాన్‍ ఖాన్‍ (Salman Khan) కు బెదిరింపులు ఎదురయ్యాయి. గతేడాది పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యలో పాల్గొన్న బ్రార్.. సల్మాన్‍ను చంపేస్తామంటూ ఇటీవల బెదిరింపు మెయిల్ పంపాడు. ఈ విషయంలో గ్యాంగ్‍స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ బ్రార్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సల్మాన్ ఖాన్ భద్రతా కారణాల రీత్యా హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు. సల్మాన్ ఖాన్ కొత్తగా బుల్లెట్ ఫ్రూప్ పెట్రోల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) ను కొన్నారు. ఈ కారు ఇండియన్ మార్కెట్‌లో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. నిస్సాన్ కంపెనీ రూపొందించిన ఎస్‌యూవీల్లో అత్యంత ఖరీదైన కారు ఇదేనట. భద్రత కూడా బీ6 లేదా బీ7 ఉంటుందని సమాచారం. బీ6లో 41ఎమ్‌ఎమ్ మందపాటి గ్లాస్, బీ7లో 78ఎమ్‌ఎమ్ మందంతో కూడిన గ్లాస్ ఉంటుంది. ఫలితంగా బుల్లెట్స్ లోపలకు చొరబడలేవు.

Also Read: 40 Dogs Killed: జగిత్యాల జిల్లాలో దారుణం.. 40 కుక్కలు హతం!