ఎన్నో అంచనాల మధ్య మొదలైన ప్రతిష్టాత్మక ‘గాడ్ ఫాదర్’ మూవీ చిరంజీవికి ఏమాత్రం మైలేజ్ ఇవ్వడం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాపై మొదట్నుంచే ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర అప్డేట్స్ ఎలాంటి ఎఫెక్ట్స్ చూపడం లేదు. ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రంలో డైనమిక్ స్పెషల్ అప్పియరెన్స్‌లో నటిస్తున్న సల్మాన్ ఖాన్ పట్ల గాడ్‌ఫాదర్ టీం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నెల 27న అనంతపురంలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరవుతానని హామీ ఇచ్చారని, అయితే సల్మాన్ దానిని వాయిదా వేసినట్లు సమాచారం.
ప్రస్తుతం హిందీ వెర్షన్ విడుదలకు కూడా ముందుకు వెళ్లడం లేదు. ఈ సినిమా దాదాపు పూర్తి కావోస్తున్న అటు ప్రేక్షకుల నుంచికానీ, డిస్టిబ్యూటర్స్ నుంచికానీ ఎలాంటి రెస్పాన్ లేకపోవడంతో మరో పెద్ద మైనస్. ఈ చిత్రం అక్టోబర్ 5 విడుదల కాబోతోంది. ప్రస్తుత పరిణామల కారణంగా గాడ్ ఫాదర్ విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు సినీ క్రిటిక్స్. కానీ అక్టోబర్ 5 న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.