Salman Farmhouse: భూతల స్వర్గం సల్మాన్ ఖాన్ ‘ఫామ్ హౌస్’.. ప్రత్యేకతలివే!

ఫామ్ లోకి అడుగుపెట్టగానే సల్మాన్ (Salman Khan) ప్రపంచాన్ని మరిచి చాలా ఇష్టంగా గడుపుతాడు.

Published By: HashtagU Telugu Desk
Salman

Salman

నిత్యం షూటింగ్స్(Shootings), స్టోరీ సిట్టింగ్స్, కెమెరాల మధ్య గడిపే సెలబ్రిటీలు మనసుకు కాసింత ప్రశాంతత కోరుకోవడం సహాజం. అందుకే ఇటీవల చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు చాలామంది తమ అభిరుచులకు తగ్గట్టుగా ఫామ్ హౌస్ (Farmhouse) ను నిర్మించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ (Bollywood) భాయిజాన్ సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తోంది.

కళ్లు చెదిరే వసతులతో రూపుదిద్దుకున్న ‘అర్పితా ఫార్మ్స్’ సల్మాన్ ఖాన్ (Salman Khan) అభిరుచులకు అనుగుణంగా విశాలమైన ప్రదేశంలో ఏర్పాటైంది. ఈ ఫామ్ లోకి అడుగుపెట్టగానే సల్మాన్ ప్రపంచాన్ని మరిచి చాలా ఇష్టంగా గడుపుతాడు. గుర్రపు స్వారీ (Horse Ride) చేస్తాడు. వరి నాట్లు వేస్తాడు. ట్రాక్టర్ తో పొలాన్ని కూడా దున్నుతాడు. షూటింగ్స్ నుంచి ఏమాత్రం గ్యాప్ దొరికినా ఫామ్ లో దూరిపోయి వ్యవసాయం (Agriculture) చేస్తూ రీఫ్రెష్ అవుతుంటాడు ఈ స్టార్ హీరో. ఇతర హీరోల ఫామ్ హౌస్ తో పోల్చిలే సల్మాన్ ఫామ్ లో అన్ని రకాల వసతులు, సౌకర్యాలున్నాయట.

ఒకటి కాదు మూడు బంగ్లాలు, రిసార్ట్ (Resort) తరహా కొలను, లాయం, గుర్రపు స్వారీ రింక్, అత్యాధునిక సదుపాయాలతో కూడిన 150 ఎకరాల లో ఫామ్‌హౌస్ విస్తరించింది ఉంది. సహజ సౌందర్యం ప్రకృతితో (Nature) ఏర్పాటైన ఈ ఫామ్ సల్మాన్ అభిరుచికి అద్దం పడుతుంది. సల్మాన్ ఖాన్ 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫామ్‌హౌస్‌కు అక్షరాల రూ. 80 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

Also Read: Jhanvi and Akhil: అఖిల్ తో జాన్వీ రొమాన్స్.. టాలీవుడ్ లో మరో ఛాన్స్?

  Last Updated: 04 May 2023, 12:08 PM IST