Somy Ali : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్న తరుణంలో ప్రముఖ హీరోయిన్ సోమీ అలీ పలు కీలక వివరాలను వెల్లడించారు. 1990వ దశకంలో అండర్ వరల్డ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు వచ్చిన కొన్ని బెదిరింపు కాల్స్ సమాచారాన్ని ఆమె బయటపెట్టారు. వివరాలివీ..
Also Read :Kamala Harris : కమలా హ్యారిస్ అమ్మమ్మ ఊరిలో ప్రత్యేక పూజలు.. తులసేంద్రపురం గురించి తెలుసా ?
ముంబైలోని గెలాక్సీ నివాసంలో మూడేళ్ల పాటు సల్మాన్ ఖాన్, సోమీ అలీ(Somy Ali) డేటింగ్ చేశారు. ఆ టైంలో సోమీ అలీతో సల్మాన్ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలో ఒకసారి సల్మాన్ ఖాన్‌కు ఓ అండర్ వరల్డ్ డాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని సోమీ అలీ చెప్పారు. తాను ఆ కాల్‌ను దగ్గరి నుంచి విన్నానని ఆమె తెలిపారు. ప్రియురాలిని కిడ్నాప్ చేస్తామని అప్పట్లో అండర్ వరల్డ్ వాళ్లు సల్మాన్‌కు వార్నింగ్ ఇచ్చారన్నారు. అయితే ఆ వ్యవహారాన్ని సల్మాన్ ఖాన్ ఆనాడు ఎలాగోలా సెటిల్ చేసుకున్నారని చెప్పారు. ఇంతకీ ఆ ఫోన్ కాల్ చేసిన అండర్ వరల్డ్ వ్యక్తి ఎవరు అనేది చెప్పాలని తాను సల్మాన్‌ను అడిగినట్లు సోమీ అలీ చెప్పారు. అయితే అలాంటి విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే మంచిదని తనకు సల్మాన్ సూచించారని వెల్లడించారు.
Also Read :Japan : జపాన్‌లో ఆటోమేటిక్ కార్గో ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ.. ఎలా పనిచేస్తుంది ?
సోమీ అలీ పాకిస్తానీ అమెరికన్ నటి. ‘ఆందోళన్’, ‘మాఫియా’ వంటి సినిమాలతో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. గతంలో ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా సల్మాన్‌ఖాన్, సోమీ అలీ ప్రేమలో పడ్డారు. అయితే మూడేళ్ల డేటింగ్‌తో వీరిద్దరి ప్రేమ ముగిసింది. ఇటీవలే సోమీ అలీ మీడియాతో మాట్లాడుతూ.. సల్మాన్‌ను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పోల్చారు. తాను తీవ్రమైన వెన్నునొప్పితో మంచం పట్టినప్పుడు.. సల్మాన్ కనీసం తనవైపు చూడలేదని ఆమె ఆరోపించారు. ఒకసారి నటి టబు తన పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. సల్మాన్‌తో అఫైర్ వల్ల తాను నష్టపోయానని సోమీ అలీ చెప్పుకొచ్చారు.