Salman Khan : వామ్మో..రూ.23 కోట్లు పెట్టి వజ్రాల వాచ్ కొనుగోలు చేసిన హీరో

సినిమా స్టార్స్ ఏదైనా సరే రిచ్ గా ఉండాలని చూస్తారు..వారు వాడే ప్రతి వస్తువు బ్రాండ్ గా ..లక్షల్లో ఉండే విధంగా చూస్తారు..విదేశాల్లో సినిమా షూటింగ్ లు చేసే టైములో కూడా వారికీ ఇష్టమైనవి కొనుగోలు చేస్తుంటారు. తాజాగా ఓ అగ్ర హీరో ఏకంగా రూ.23 కోట్లు పెట్టి వజ్రాల వాచ్ ను కొనుగోలు చేసాడట. ఆ హీరో ఎవరో కాదు మన కండల వీరుడు సల్మాన్ ఖాన్. We’re now on WhatsApp. Click to […]

Published By: HashtagU Telugu Desk
Salman Watch

Salman Watch

సినిమా స్టార్స్ ఏదైనా సరే రిచ్ గా ఉండాలని చూస్తారు..వారు వాడే ప్రతి వస్తువు బ్రాండ్ గా ..లక్షల్లో ఉండే విధంగా చూస్తారు..విదేశాల్లో సినిమా షూటింగ్ లు చేసే టైములో కూడా వారికీ ఇష్టమైనవి కొనుగోలు చేస్తుంటారు. తాజాగా ఓ అగ్ర హీరో ఏకంగా రూ.23 కోట్లు పెట్టి వజ్రాల వాచ్ ను కొనుగోలు చేసాడట. ఆ హీరో ఎవరో కాదు మన కండల వీరుడు సల్మాన్ ఖాన్.

We’re now on WhatsApp. Click to Join.

సల్మాన్ కేవలం సినిమాల పరంగానే కాదు పలు టీవీ షోస్ , వ్యాపార రంగంలో, ఎండార్స్​మెంట్స్​, యాడ్స్​ రూపంలో ఇలా చాల చోట్ల నుండి డబ్బు సంపాదిస్తూ..లగ్జరీ లైఫ్​ లీడ్ చేస్తున్నాడు. అయితే మామూలుగానే ఆయనకు రిస్ట్ వాచ్​ (Wrist Watch)లు అంచే చాలా ఇష్టం. వాచ్​ కలెక్షన్​లో సల్మాన్​ ఎప్పుడూ ముందుంటారట. రీసెంట్​గా సల్మాన్ కలెక్షన్​లో ఓ గ్రాండ్ వాచ్ చేరింది.

డైమండ్స్​ పొదిగిన ఈ వాచ్ తో తాజాగా సల్మాన్ ఫోటో షూట్ చేసాడు. సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్​లు ధరించడం కొత్తేం కాదు. కానీ, ఆయన గతంలో ధరించిన వాచ్​ల ఖరీదు ఎక్కువలో ఎక్కువ రూ.4కోట్ల విలువైంది కావడంతో అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ వాచ్ ధర అక్షరాల రూ.23కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అది పాటెక్ ఫిలిప్ రెయిన్​ బో (Patek Philippe Rainbow Watch)అనే కంపెనీకి చెందిన వాచ్​ అని సమాచారం. దాంట్లో దాదాపు 130 వజ్రాలు పొదిగి ఉన్నాయట. అందుకే ఈ వాచ్ కు అంత ధర అని చెపుతున్నారు.

Read Also : Chalo Medigadda : బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’‌లో ఊహించని ఘటన.. పేలిన బస్సు టైర్

  Last Updated: 01 Mar 2024, 01:23 PM IST