Salman Khans Security: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రముఖ రాజకీయ నాయకుడు బాబా సిద్దిఖీ హత్య జరిగినప్పటి నుంచి అక్కడి సెలబ్రిటీలను ఒక రకమైన ఆందోళన ఆవరించింది. మళ్లీ గ్యాంగ్‌స్టర్ల రాజ్యం వచ్చిందా అన్నట్టుగా సెలబ్రిటీలు కలవరానికి గురవుతున్నారు. పోలీసుల సెక్యూరిటీ ఉండగానే షూటర్లు వచ్చి బాబా సిద్దిఖీని హత్య చేసి పరార్ కావడం కొన్ని నెలల క్రితం దేశంలో సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి బాబా సిద్దిఖీ సన్నిహితుడు, ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత సెక్యూరిటీని క్రమంగా పెంచుకుంటున్నారు. తన బాడీగార్డుల సంఖ్యను సల్మాన్(Salman Khans Security) చాలావరకు పెంచారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకు కేటాయించే భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచింది. సల్లూభాయ్ ఇంటి పరిసరాల్లో పెద్దసంఖ్యలో పోలీసులను మోహరిస్తున్నారు.
Also Read :Oscars 2025: ఆస్కార్ రేసులో ‘కంగువ’.. మరో రెండు భారతీయ సినిమాలు సైతం
తాజాగా సల్మాన్ ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ‘గెలాక్సీ అపార్ట్‌మెంట్స్’లోని మొదటి అంతస్తులో ఉన్న బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను ఫిట్ చేయించారు. ఇంటి చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లూ రంగులో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను సల్మాన్ ఇంటిలోని ఒక బాల్కనీకి అమరుస్తున్న సీన్‌లు ఆ ఫొటోలలో ఉన్నాయి. ఆ బాల్కనీకి మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఎందుకు అమరుస్తున్నారు ? అంటే.. అందులో నుంచే తన ఫ్యాన్స్‌కు సల్మాన్ అభివాదం చేస్తుంటారు.
Also Read :Earthquake Alerts : మీ ఫోన్‌కు భూకంపాల అలర్ట్స్ రావాలా ? ఈ సెట్టింగ్స్ చేసుకోండి
గెలాక్సీ అపార్ట్‌మెంటులోని గ్రౌండ్ ఫ్లోర్‌లోనే సల్మాన్ నివసిస్తుంటారు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను అమర్చిన 1వ అంతస్తులో సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు నివసిస్తుంటారు. 1వ అంతస్తులో ఉన్న బాల్కనీ నుంచే ఫ్యాన్స్‌ను సల్మాన్ పలకరిస్తుంటారు. అందుకే పేరెంట్స్‌తో పాటు తన సెక్యూరిటీ కోసం బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను సల్మాన్ ఏర్పాటు చేయించారట. సల్లూ భాయ్ ఇంటి చుట్టూ హైరెజెల్యూషన్ సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి. వాటి సాయంతో ఇంటి పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా వెంటనే భద్రతా సిబ్బంది గుర్తిస్తారు.