బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చినా సికిందర్ (Sikindar) సినిమా భారీ అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, సల్మాన్ తన కెరీర్‌లో మరో మేజర్ బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం భారత సినీ రంగంలో తెలుగు సినిమాల హవా కొనసాగుతుండటంతో, బాలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు డైరెక్టర్లవైపు ఆసక్తిగా చూస్తున్నారు.
NTR Look: నయా లుక్‌తో తారక్ మెస్మరైజ్
ఈ క్రమంలో సల్మాన్ ఖాన్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో పని చేస్తున్న హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఒక భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హరీష్ శంకర్ కమర్షియల్ సినిమాలను మెరుగైన రీతిలో తెరకెక్కించడంలో మంచి పేరును సంపాదించుకున్న డైరెక్టర్. ఆయనతో కలిసి సినిమా చేయడం ద్వారా సల్మాన్ ఖాన్ మళ్లీ తన మ్యాస్స్ ఇమేజ్‌ని ప్రజల్లో మళ్లీ ప్రతిష్ఠించాలనుకుంటున్నారు. ఇద్దరి కాంబినేషన్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఇండస్ట్రీలో ఈ వార్తలు వేగంగా పాకుతున్నాయి.
హరీష్ శంకర్ గతంలో రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాతే సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్ పై పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే, అది తెలుగు, హిందీ ఇండస్ట్రీల మధ్య మరో క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.