Salman Khan :పెళ్లిపై సల్మాన్ సంచలన వ్యాఖ్యలు.. ఇక పెళ్లి చేసుకోడా?

సల్మాన్ మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా అడిగే మొదటి ప్రశ్న పెళ్లి గురించే. ఇన్నాళ్లు పెళ్లి గురించి అడిగితే చేసుకుంటాను అనేవాడు కానీ ఈ సారి మాత్రం షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు సల్లూ భాయ్.

Published By: HashtagU Telugu Desk
Salman Khan shocking comments on Marriage goes viral

Salman Khan shocking comments on Marriage goes viral

ఇండియా(India)లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్(Bachelor) లో ఫస్ట్ వినిపించే పేరు సల్మాన్ ఖాన్(Salman Khan) దే. 57 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి(Marriage) మాట మాత్రం ఎత్తట్లేదు. గతంలో అనేక మంది హీరోయిన్స్ తో ప్రేమ వ్యవహారాలు నడిపినా ఎవ్వరూ పెళ్లి దాకా రాలేదు. దీంతో ఇన్నేళ్ల నుంచి సల్మాన్ ఖాన్ ఒంటరిగానే మిగిలిపోయాడు. ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కూడా నడపట్లేదు. ఒక్క రూమర్ కూడా రావట్లేదు సల్మాన్ పై.

సల్మాన్ మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా అడిగే మొదటి ప్రశ్న పెళ్లి గురించే. ఇన్నాళ్లు పెళ్లి గురించి అడిగితే చేసుకుంటాను అనేవాడు కానీ ఈ సారి మాత్రం షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు సల్లూ భాయ్. తాజాగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల కార్యక్రమం దుబాయ్ లో జరగగా బాలీవుడ్ కి చెందిన అనేక మంది స్టార్స్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు.

సల్మాన్ ఈ వేడుకకు రాగానే బయట మీడియా అతన్ని చుట్టుముట్టింది. మీడియా వాళ్ళు పలు ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా అభిమాని మధ్యలో వచ్చి.. సల్మాన్, నేను మిమ్మల్ని చూసినప్పుడే పడిపోయాను అనగా మీరు షారుఖ్ గురించి మాట్లాడుతున్నారా అని సరదాగా అన్నాడు సల్మాన్. కాదు మిమ్మల్నే ఇష్టపడుతున్నాను, మీ కోసం హాలీవుడ్ నుంచి వచ్చాను, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని ఆ మహిళా అభిమాని మీడియా ముందు అడిగింది. దీనికి సల్మాన్ సమాధానమిస్తూ.. నాకు పెళ్లి వయసు అయిపోయింది. ఓ 20 ఏళ్ళ క్రితం నన్ను కలిసి ఉంటె బాగుండేది అని అన్నాడు.దీంతో సల్మాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పెళ్లి వయసు అయిపోయింది అంటే సల్మాన్ ఇక పెళ్లి చేసుకోడా అని అభిమానులు,నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

 

Also Read : Malaika Arora: మలైకా బోల్డ్ ఫోటో షూట్: వీడియో వైరల్

  Last Updated: 27 May 2023, 06:57 PM IST