Site icon HashtagU Telugu

Salman and SRK: సల్మాన్, షారుఖ్ జోడీలో యాక్షన్ మూవీ

Srk Salman

Srk Salman

ఇద్దరు ఖాన్ లు.. సల్మాన్, షారుఖ్ మళ్లీ జత కట్టనున్నారు. వీరి కాంబినేషన్లో సరికొత్త యాక్షన్ మూవీని నిర్మించేందుకు అవసరమైన స్టోరీని యశ్ రాజ్ ఫిల్మ్ (YRF)కి చెందిన ఆదిత్య చోప్రా రాయనున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయడంపై ఆయన పని చేస్తున్నట్లు సమాచారం.

2023 ఆఖరు కల్లా షూటింగ్ ప్రారంభమై.. 2024 మార్చికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది.సల్మాన్, షారుఖ్ జోడీలో పూర్తిస్థాయి మూవీ ” కరణ్ జోహర్ ” చివరగా 1995 సంవత్సరంలో విడుదలైంది. మళ్లీ ఈ ఇద్దరు మెగా హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించే రోజులు ఎంతో దూరంలో లేవని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. మరోవైపు షారుఖ్ ఖాన్ కొత్త మూవీ “పఠాన్” 2023 జనవరి 25న రిలీజ్ కానుంది.

సల్మాన్ ఖాన్ “టైగర్ 3” మూవీ 2023 ఏప్రిల్ 21న విడుదల కానుంది. విశేషం ఏమిటంటే.. “పఠాన్” మూవీలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. “టైగర్ 3” మూవీలో అతిథి పాత్రలో షారుఖ్ ఖాన్ అలరించనున్నారు. ఇద్దరు ఖాన్ ల మధ్య ఉన్న ఫ్రెండ్లీ నేచర్ కు ఈ అతిథి పాత్రలే పెద్ద నిదర్శనం. షారుఖ్ ఖాన్ చాలా సందర్భాల్లో సల్మాన్ ను తన సోదర సమానుడిగా అభివర్ణించారు. సల్మాన్ కూడా షారుఖ్ ను ఎంతగానో గౌరవిస్తారు. ఈ క్రమంలోనే షారుఖ్ సినిమా “పఠాన్” రిలీజ్ అయిన 3 నెలల తర్వాత తన మూవీని రిలీజ్ చేసుకుంటానని షారుఖ్ చెప్పాడట.

 

Exit mobile version