Site icon HashtagU Telugu

Salman Khan : తన ప్రేమ జీవితంపై మనసు విప్పిన బాలీవుడ్ కండల వీరుడు

Salman Khan

Salman Khan

Salman Khan : బాలీవుడ్‌ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రేమ జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎన్నో స్టార్ హీరోయిన్లతో రూమర్లు వచ్చినప్పటికీ, 59 ఏళ్ల వయసులోనూ ఆయన ఇంకా బ్యాచిలర్ గానే కొనసాగుతున్నారు. తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్న సల్మాన్, తన ప్రేమకథలపై నిజాయితీగా స్పందించారు.

ఈ షోలో కమెడియన్ కపిల్ శర్మ సరదాగా “నీకొన్ని ఎక్కువ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నట్లున్నారు” అని వ్యాఖ్యానించగా, సల్మాన్ తేల్చి చెప్పారు. “అది నిజం కాదు. నా వయసును చూస్తే గర్ల్‌ఫ్రెండ్స్ సంఖ్య చాలా తక్కువ. నాకంటే యంగ్ జనరేషన్‌లో సంబంధాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. నా జీవితంలో ముగ్గురు లేదా నలుగురు మాత్రమే, కానీ ఒక్కో సంబంధం ఏడు నుంచి పన్నెండు సంవత్సరాలపాటు కొనసాగింది.”

America Attack : ఇరాన్ మీద అమెరికా వేసిన బాంబు బరువు ఎంతో..ఆ బాంబ్ విశేషాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

ఇప్పుడు ఉన్న డేటింగ్ ట్రెండ్‌పై సల్మాన్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ—”ఇప్పటి యువత ఎక్కువ కాలం ఒకే సంబంధాన్ని కొనసాగించడం లేదు. కానీ నేను ఓల్డ్ స్కూల్ లవర్‌ని. నా బంధాలు తక్కువగానే ఉన్నా, అవి చాలా కాలం నిలిచాయి. నేను ట్రెండ్స్ కన్నా నిజమైన కనెక్షన్‌ను కోరుకుంటాను” అని అన్నారు.

తన ప్రేమ విషయాలపై స్పష్టతనిచ్చిన సల్మాన్ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. తాను ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదో, ప్రేమను ఎలా చూస్తాడో ఓ స్పష్టతను అందించారు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నతో కలిసి ‘సికందర్’ చిత్రంలో నటిస్తున్నారు. 36 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో హిట్స్ ఇచ్చిన ఈ స్టార్, వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం ఇప్పటికీ ప్రశ్నల కేంద్రంగా మారుతూనే ఉన్నారు.

National Highway : ఏపీలో మరో జాతీయ రహదారి..ఎక్కడి నుండి ఎక్కడికంటే